డాక్టర్‌ భద్ర | Amala Paul to play forensic surgeon in her next film | Sakshi
Sakshi News home page

డాక్టర్‌ భద్ర

Jan 4 2019 4:46 AM | Updated on Jan 4 2019 4:46 AM

Amala Paul to play forensic surgeon in her next film - Sakshi

అమలా పాల్‌

కెమెరా వదిలేసి స్టెతస్కోప్‌ పట్టనున్నారు అమలా పాల్‌. కన్‌ప్యూజ్‌ కావొద్దు. మేటర్‌ కంటిన్యూ చేయండి. ఫుల్‌ క్లారిటీ దొరుకుతుంది. అమలా పాల్‌ వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌ పాత్రలో నటించిన ‘అదో అంద పరవై పోల’ సినిమా షూటింగ్‌ ఇటీవలే కంప్లీట్‌ అయ్యింది. ఇప్పుడామె తన నెక్ట్స్‌ చిత్రం కోసం ఫోరెన్సిక్‌ డాక్టర్‌గా మారబోతున్నారు. సో.. కెమెరా నుంచి స్టెతస్కోప్‌కి మారనున్నారు. మలయాళం, తమిళ భాషల్లో రూపొందనున్న ఈ సినిమాకు అనూప్‌ పానికర్‌ దర్శకత్వం వహిస్తారు. ఈ సినిమాకు అభిలాష్‌ పిళ్లై రచయిత. ‘‘తమిళనాడు పోలీస్‌ చీఫ్‌ సర్జన్‌ డాక్టర్‌ భద్ర పాత్రలో అమలా నటించనున్నారు. క్లిష్టమైన కేసులను ఆమె ఎంత సులువుగా పరిష్కరించారనే నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. కేరళ పోలీస్‌ విభాగానికి చెందిన మాజీ ఫోరెన్సిక్‌ సర్జన్‌ డాక్టర్‌ బి. ఉమదాథాన్‌ జీవితంలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కబోతోందని కోలీవుడ్‌ టాక్‌.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement