అక్కినేని వారసుడితో ఢీ అంటున్న అల్లు వారబ్బాయి

Allu Sirish to clash with Akhil akkineni this Christmas - Sakshi - Sakshi

తొలి సినిమాతో నిరాశపరిచిన అక్కినేని వారసుడు అఖిల్, తన రెండో సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఇన్నాళ్లు పెద్దగా అంచనాలు లేని ఈ సినిమాపై టీజర్ రిలీజ్ తరువాత మంచి హైప్ క్రియేట్ అయ్యింది. అఖిల్ చేసిన పోరాట సన్నివేశాలు హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయంటున్నారు ఫ్యాన్స్. ఈ సినిమాను క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 22న రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్.

మరో వారసుడు అల్లు వారబ్బాయి శిరీష్ కూడా ప్రస్తుతం వీఐ ఆనంద్ దర్శకత్వంలో ఓ ఆసక్తికరమైన సినిమా చేస్తున్నాడు. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అమైరా దస్తర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ఒక్క క్షణం అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇటీవల శ్రీరస్తు శుభమస్తు సినిమాతో తొలి విజయాన్ని అందుకున్న శిరీష్, ఒక్క క్షణంతో బిగ్ హిట్ మీద కన్నేశాడు. డిఫరెంట్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను కూడా క్రిస్టమస్ బరిలోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇలా ఇద్దరు స్టార్ వారసులు ఒకేసారి బరిలో దిగిటంపై టాలీవుడ్ సర్కిల్స్ లో చర్చ మొదలైంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top