పాకెట్‌ మనీ కట్‌ | Allu Sirish to act in Telugu remake of Malayalam movie 'ABCD' | Sakshi
Sakshi News home page

పాకెట్‌ మనీ కట్‌

Published Sun, Sep 9 2018 1:41 AM | Last Updated on Sun, Sep 9 2018 1:54 AM

Allu Sirish to act in Telugu remake of Malayalam movie 'ABCD' - Sakshi

కోటీశ్వరుడి కుటుంబంలో పుట్టిన ఓ కుర్రాడు సాదాసీదా జీవితం గడపాల్సి వచ్చింది. లక్షల్లో పాకెట్‌ మనీ తీసుకున్న ఆ కుర్రాడికి చివరికి 5 వేలే అని ఇంట్లో ఫిక్స్‌ చేస్తారు. అలా ఎందుకు? అంటే దానికో పెద్ద కారణం ఉంది. అదేంటో థియేటర్‌లో తెలుసుకుంటేనే కదా థ్రిల్‌. అల్లు శిరిష్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఏబీసీడీ (అమెరికన్‌ బోర్న్‌ కన్‌ఫ్యూజ్డ్‌ దేశీ). రుక్సానా కథానాయిక.

ఈ సినిమా ద్వారా సంజీవ్‌ రెడ్డి తెలుగు పరిశ్రమకు దర్శకునిగా పరిచయం అవుతున్నారు. మలయాళంలో దుల్కర్‌ సల్మాన్‌ నటించిన ‘ఏబీసీడీ’ చిత్రానికి ఇది రీమేక్‌. ప్రస్తుతం ఈ సినిమా తాజా షెడ్యూల్‌ హైదరాబాద్‌లో జరుగు తోంది. ఇందులో కోటీశ్వరుడి తండ్రికి కొడుకుగా అవినాష్‌ పాత్రలో అల్లు శిరీష్‌ నటిస్తున్నారని సమాచారం. అలాగే కామెడీ యాక్టర్‌ భరత్‌ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement