ఏబీసీడీలకు వేళాయె | Allu Sirish ABCD Movie Launch | Sakshi
Sakshi News home page

ఏబీసీడీలకు వేళాయె

Jun 19 2018 1:16 AM | Updated on Jun 19 2018 1:16 AM

Allu Sirish ABCD Movie Launch - Sakshi

అల్లు అరవింద్‌, అల్లు శిరీష్‌, రుక్సార్‌ థిల్లాన్‌

మలయాళంలో సూపర్‌ హిట్‌ అయిన ‘ఏబీసీడీ’ చిత్రాన్ని అల్లు శిరీష్‌ కథానాయకుడిగా తెలుగులో అదే పేరుతో రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రుక్సార్‌ థిల్లాన్‌ కథానాయిక. సంజీవ్‌ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మధుర ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై మధుర శ్రీధర్, బిగ్‌బెన్‌ సినిమాస్‌ బ్యానర్‌పై యశ్‌ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా సోమవారం ప్రారంభమైంది.

హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి నిర్మాతల అల్లు అరవింద్‌ క్లాప్‌ ఇవ్వగా మరో నిర్మాత సురేశ్‌ బాబు కెమెరా స్విచ్చాన్‌ చేశారు. పలు చిత్రాల్లో బాల నటుడిగా అలరించిన మాస్టర్‌ భరత్‌ ‘ఏబీసీడీ’ చిత్రంలో అల్లు శిరీష్‌ స్నేహితుడిగా ఫుల్‌ లెంగ్త్‌ క్యారెక్టర్‌ పోషిస్తున్నాడు. కన్నడ టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ జుధా సాంధీ ఈ సినిమాకి స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ చిత్రానికి కో ప్రొడ్యూసర్‌: ధీరజ్‌ మొగిలినేని.

Advertisement
 
Advertisement
Advertisement