'పవన్ కళ్యాణ్ పాట కాబట్టి సరిపోయింది' | Allu arjun tweets on sardaar audio | Sakshi
Sakshi News home page

'పవన్ కళ్యాణ్ పాట కాబట్టి సరిపోయింది'

Mar 29 2016 6:41 PM | Updated on Sep 3 2017 8:49 PM

'పవన్ కళ్యాణ్ పాట కాబట్టి సరిపోయింది'

'పవన్ కళ్యాణ్ పాట కాబట్టి సరిపోయింది'

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న సర్థార్ గబ్బర్సింగ్ ఫీవర్ అభిమానులతో పాటు స్టార్ హీరోలలో కూడా బాగా కనిపిస్తోంది. ముఖ్యంగా మెగా హీరోలు ఈ సినిమా ప్రమోషన్...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న సర్దార్ గబ్బర్సింగ్ ఫీవర్ అభిమానులతో పాటు స్టార్ హీరోలలో కూడా బాగా కనిపిస్తోంది. ముఖ్యంగా మెగా హీరోలు ఈ సినిమా ప్రమోషన్ కోసం అన్ని రకాలుగా కష్టపడుతున్నారు. తాజాగా మెగా హీరో అల్లు అర్జున్ చేసిన ట్వీట్స్, మీడియా సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారాయి.

'దేవుడా... నా కొడుకు అయాన్, నా ఫోన్లో ఐ ట్యూన్స్ నుంచి సాంగ్స్ వింటూ కనిపించాడు. నా ట్విట్టర్ ఎకౌంట్ నుంచి సర్దార్ గబ్బర్ సింగ్ పాటలను ఓపెన్ చేశాడు. వాడికి ఫోన్ గురించి ఏమీ తెలియదు. అయినా వాడు పాటలు ప్లే చేశాడంటే అది కేవలం లక్ మాత్రమే'. అంటూ ట్వీట్ చేశాడు.

అంతేకాదు ఈ ట్వీట్స్ కు కొసమెరుపుగా తన మార్క్ కామెడీ టచ్ కూడా ఇచ్చాడు బన్నీ. అయాన్ పాటలు వినటం చూసిన బన్నీ భార్య స్నేహ.. 'అది పవన్ పాట కాబట్టి సరిపోయింది, ఇంకెవరి పాట అన్నా అయి ఉంటే' అంటూ కంగారు పడిందంట. బన్నీ ఫోన్లో అంతలా భయపడేలా ఇంకెవరి పాటలు ఉంటాయో మరి. ఏది ఏమైనా సర్దార్ గబ్బర్సింగ్ను వీలైనంతగా ప్రమోట్ చేయటం కోసం మెగా హీరోలు తెగ కష్టపడిపోతున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement