బన్నీ మళ్లీ దొరికిపోయాడు | Allu Arjun Trolled with Impact Dialogue | Sakshi
Sakshi News home page

Apr 9 2018 2:22 PM | Updated on Apr 9 2018 2:22 PM

Allu Arjun Trolled with Impact Dialogue - Sakshi

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మళ్లీ సోషల్ మీడియాలో అడ్డంగా దొరికిపోయాడు. మొన్నీ మధ్యే మోదీ తనకు ఇన్సిపిరేషన్ అంటూ బన్నీ ఇచ్చిన స్టేట్ మెంట్ వైరల్ అయి దుమారం రేపింది. ఇప్పుడు కొత్త చిత్రం నా పేరు సూర్య డైలాగ్ ఇంపాక్ట్ మూలంగా బన్నీని సోషల్ మీడియాలో నిర్దాక్షిణ్యంగా ట్రోల్ చేసి పడేస్తున్నారు. 
 
‘సౌత్ ఇండియా.. నార్త్‌ ఇండియా.. ఈస్ట్.. వెస్ట్‌.. అన్ని ఇండియాలు లేవురా మనకి ఒక్కటే ఇండియా’ అంటూ డైలాగ్ చెబుతాడు. అయితే అల్లు అర్జున్ అఫీషియల్ ట్విటర్ ప్రొఫైల్ లో మాత్రం "సౌత్ ఇండియన్ యాక్టర్'' అని ఉండటం గమనించిన కొందరు.. దేశభక్తి డైలాగుల వరకేనా? అంటూ ప్రశ్నిస్తున్నారు. మరికొందరు.. రీల్ స్టార్సే తప్ప రియల్ స్టార్స్ కాదంటూ... ట్వీట్లు చేస్తూ బన్నీని ఏకేస్తున్నారు. ఇక యాంటీ ఫ్యాన్స్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. 

ఆ సంగతి పక్కన పెడితే వక్కంతం వంశీ డైరెక్షన్ లో తెరకెక్కిన "నా పేరు సూర్య చిత్రంలో అనూ ఇమ్మాన్యూయేల్ హీరోయిన్ కాగా, అర్జున్, బొమన్ ఇరానీ, రాధిక శరత్ కుమార్, రావు రమేష్, వెన్నెల కిషోర్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు.  మే 4న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement