‘అన్ని ఇండియాలు లేవురా మనకి’ | Sakshi
Sakshi News home page

Published Sun, Apr 8 2018 10:17 AM

Allu Arjun Naa Peru Surya Naa Illu India Dialogue Impact - Sakshi

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కుతున్న హై వోల్టేజ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. బన్నీ తొలిసారిగా ఆర్మీ ఆఫీసర్‌ గా నటిస్తున్న ఈ సినిమాలో అను ఇమ్మాన్యూల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. పలు విజయవంతమైన చిత్రాలకు కథలు అందించిన వక్కంతం వంశీ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. మే 4న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్.

ఇప్పటికే రిలీజ్‌ అయిన పోస్టర్‌, టీజర్‌ కు మంచి రెస్పాన్స్ రావటంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. బన్నీ డిఫరెంట్‌ మేకోవర్‌లో డిఫరెంట్ బాడీ లాంగ‍్వేజ్‌తో ఆకట్టుకుంటున్న ఈ సినిమాతో మరోసారి రికార్డ్‌లు తిరగరాయటం ఖాయం అని భావిస్తున్నారు ఫ్యాన్స్‌. ఈ రోజు(ఆదివారం) అల్లు అర్జున్‌ పుట్టిన రోజు సందర్భంగా డైలాగ్‌ ఇంపాక్ట్‌ ను రిలీజ్ చేశారు. విలన్‌ ‘సౌత్ ఇండియాకా సాలా’ అంటే ‘సౌత్ ఇండియా.. నార్త్‌ ఇండియా.. ఈస్ట్.. వెస్ట్‌.. అన్ని ఇండియాలు లేవురా మనకి ఒక్కటే ఇండియా’ అంటూ బన్నీ చెప్పిన డైలాగ్‌కు సూపర్బ్‌ రెస్పాన్స్‌ వస్తోంది.

Advertisement
 
Advertisement
 
Advertisement