అల్లు అర్జున్‌ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం | Allu Arjun Modi Inspiration Comments in Controversy | Sakshi
Sakshi News home page

Apr 6 2018 5:55 PM | Updated on Apr 7 2018 4:23 AM

Allu Arjun Modi Inspiration Comments in Controversy - Sakshi

టాలీవుడ్‌ స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాజాగా ప్రముఖ మ్యాగ్జైన్‌ ఒపీనియన్‌ ఎక్స్‌ప్రెస్‌ కవర్‌ పేజీపై బన్నీ ఫోటోను ప్రచురించింది. అంతేకాదు స్టైలిష్‌ స్టార్‌ ఆఫ్‌ ది మిలీనియమ్‌గా బన్నీ పేరును ప్రకటించింది. ఈ సందర్భంగా సదరు మ్యాగ్జైన్‌ నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో బన్నీ చేసిన వ్యాఖ్యలు విమర్శలకు కారణం అయ్యాయి. 

తనకు ప్రధాని నరేంద్ర మోదీ అంటే ప్రేరణ అని.. ఆయన స్ఫూర్తితోనే తాను ముందుకు సాగుతానంటూ బన్నీ ఇంటర్వ్యూలో ఓ ప్రశ్నకు బదులిచ్చాడు. అయితే ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేర్చని ‍వ్యక్తి ఆదర్శమంటూ ఎలా చెప్తాడంటూ పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో బన్నీని ట్రోల్‌ చేసేస్తున్నారు. 

అయితే బన్నీ వివరణ క్షుణ్ణంగా చూస్తే... ఓ సాధారణ వ్యక్తి నుంచి ప్రధాని స్థాయికి ఎదిగిన మోదీని చాలా మంది యువత ఆదర్శంగా తీసుకున్నారని.. తాను కూడా ఆయన జీవితం నుంచి స్ఫూర్తి పొందానని చెప్పాడు. కానీ, కొందరు మాత్రం దానిని వేరేలా పరిగణనలోకి తీసుకుంటూ విమర్శించేస్తున్నారు. పైగా హోదా ఉద్యమం ఉవ్వెత్తున సాగుతుండటంతో.. రాంగ్‌ టైమింగ్‌లో బన్నీ కామెంట్‌ చేశాడంటూ సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement