బన్నీ ఇంకా ఫిక్స్ అవ్వలేదా..!

Allu Arjun Taking Time To Lock The Director - Sakshi

స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్‌ నా పేరు సూర్య  సినిమా తరువాత ఇంత వరకు మరో సినిమా అంగీకరించలేదు. ఆ సినిమా ఆశించిన స్థాయి విజయం సాధించకపోవటంతో తదుపరి చిత్రం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు బన్నీ. ఇప్పటికే విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో బన్నీ హీరోగా ఓ సినిమా ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై అల్లు అర్జున్‌ టీం ఎలాంటి ప్రకటనా చేయలేదు.

తాజాగా మరో ఆసక్తికరమైన వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. యువ దర్శకులు మారుతి, పరుశురాంలు కూడా బన్నీ కోసం కథ రెడీ చేస్తున్నారట. అంటే విక్రమ్‌ కథను ఇంకా బన్నీ ఫైనల్ చేయలేదా..? లేక విక్రమ్‌ సినిమా తరువాత చేయబోయే సినిమాను కూడా బన్నీ లైన్‌లో పెడుతున్నాడా..? అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం దొరకాలంటే మాత్రం బన్నీ క్లారిటీ ఇవ్వాల్సిందే.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter |
తాజా సమాచారం కోసం డౌన్ లోడ్ చేసుకోండి

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top