ఇండిపెండెన్స్ డేకి బన్నీ సర్ప్రైజ్..! | allu arjun Suprise For this Independence Day | Sakshi
Sakshi News home page

ఇండిపెండెన్స్ డేకి బన్నీ సర్ప్రైజ్..!

Aug 3 2017 12:21 PM | Updated on Sep 17 2017 5:07 PM

ఇండిపెండెన్స్ డేకి బన్నీ సర్ప్రైజ్..!

ఇండిపెండెన్స్ డేకి బన్నీ సర్ప్రైజ్..!

డీజే దువ్వాడ జగన్నాథమ్ సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్,

డీజే దువ్వాడ జగన్నాథమ్ సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, బుధవారం తన కొత్త సినిమాను స్టార్ట్ చేశాడు. రచయిత వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాలో నటిస్తున్నాడు బన్నీ. బన్నీ సరసన అనూ ఇమ్మన్యూల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అర్జున్, శరత్ కుమార్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

వెంటనే రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించి 2018 సమ్మర్ లో సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. బన్నీకి బాగా కలిసొచ్చిన ఏప్రిల్ నెలలో 27వ తేదిన సినిమాను రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు.  ఈ సినిమాకు సంబంధించి ఇండిపెండెన్స్ రోజు ఓ సర్ప్రైజ్ ఇస్తానంటున్నాడు అల్లు అర్జున్. మరి బన్నీ ఇవ్వబోయే సర్ప్రైజ్ ఏమై ఉంటుందన్న చర్చ జరుగుతోంది. ఫస్ట్ లుక్ లేదా టీజర్ ను రిలీజ్ చేస్తారని భావిస్తున్నారు. ఈసినిమాలో బన్నీ సోల్జర్ గా కనిపించనున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement