సరైనోడు | Allu Arjun’s Sarainodu Movie ‘Blockbuster’ Video Song Promo Released | Sakshi
Sakshi News home page

సరైనోడు

Mar 27 2016 11:31 PM | Updated on Sep 3 2017 8:41 PM

సరైనోడు

సరైనోడు

కండలు తిరిగిన దేహం.... చురకత్తుల్లాంటి చూపులు... ప్రేమించే మనసు...

కండలు తిరిగిన దేహం.... చురకత్తుల్లాంటి చూపులు... ప్రేమించే మనసు... తేడా వస్తే ఎంతకైనా తెగించే ధైర్యం... ఇలా అన్ని క్వాలిటీస్ ఉన్న సరైనోడు ఆ కుర్రాడు. ఇన్ని లక్షణాలున్న పవర్‌ఫుల్ కుర్రాడి పాత్రలో అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘సరైనోడు’. బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అరవింద్ ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఇందులో అల్లు అర్జున్ ఏ రేంజ్‌లో రెచ్చిపోయి డ్యాన్స్ చేశారో చూపించడానికి శాంపుల్‌గా ఇటీవల  ‘బ్లాక్ బస్టరే...’ పాట ప్రోమోను  విడుదల చేశారు.

దీనికి యూట్యూబ్‌లో మంచి స్పందన లభిస్తోందని చిత్రబృందం ఆనందం వ్యక్తం చేసింది. ఏప్రిల్ 22న ఈ చిత్రం విడుదల కానుంది. ఏప్రిల్ 1న ఈ చిత్రం పాటలను నేరుగా మార్కెట్‌లోకి విడుదల చేయనున్నారు. ‘‘ఏప్రిల్ 10న విశాఖపట్నంలో ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను భారీ ఎత్తున నిర్వహించనున్నాం. వేసవిలో అందరినీ అలరించే చిత్రం అవుతుంది’’ అని నిర్మాత తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement