అల్లు వారసుడి పేరు అయాన్ | Allu Arjun names his son Ayaan | Sakshi
Sakshi News home page

అల్లు వారసుడి పేరు అయాన్

Apr 13 2014 11:21 PM | Updated on Sep 2 2017 5:59 AM

అల్లు వారసుడి పేరు అయాన్

అల్లు వారసుడి పేరు అయాన్

వైవాహిక బంధానికి అసలైన అర్థం బిడ్డ పుట్టిన తర్వాతే తెలుస్తుందని ఇటీవల తండ్రయిన సందర్భంగా అల్లు అర్జున్ పేర్కొన్నారు.

వైవాహిక బంధానికి అసలైన అర్థం బిడ్డ పుట్టిన తర్వాతే తెలుస్తుందని ఇటీవల తండ్రయిన సందర్భంగా అల్లు అర్జున్ పేర్కొన్నారు. తల్లిదండ్రులు కాకముందు, ఆలుమగలు ఏదో డేటింగ్ చేస్తున్నట్లుగా ఉంటుందని కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. తన ముద్దుల తనయుడికి ‘అయాన్’ అనే పేరుని ఖరారు చేశారు. ఈ పేరుకి ఇస్లామ్‌లో ‘దేవుడి బహుమతి’ అని, సంస్కృతంలో ‘పవిత్రం’ అని, పెర్షియన్‌లో ‘గుర్తుంచుకోదగ్గవాడు’ అని, హెబ్రూలో ‘ప్రశాంతం’ అని అర్థం అని అల్లు అర్జున్ పేర్కొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement