చిన్నారితో ఆటలు...కొత్త పాఠాలు! | Allu Arjun: Most searched star on Google 2016 | Sakshi
Sakshi News home page

చిన్నారితో ఆటలు...కొత్త పాఠాలు!

Dec 16 2016 11:42 PM | Updated on Sep 4 2017 10:53 PM

చిన్నారితో ఆటలు...కొత్త పాఠాలు!

చిన్నారితో ఆటలు...కొత్త పాఠాలు!

అమ్మాయి పుట్టినప్పట్నుంచీ అల్లు అర్జున్‌ షూటింగ్‌లకు సెలవు ప్రకటించారు.

అమ్మాయి పుట్టినప్పట్నుంచీ అల్లు అర్జున్‌ షూటింగ్‌లకు సెలవు ప్రకటించారు. చిన్నారి మెలకువగా ఉన్నంత సేపూ తనతో ఆడుకుంటున్నారు. చిట్టిపాప నిద్రపోయాక శ్రద్ధగా క్లాసులో గురువుగారు చెప్పే పాఠాలు వింటున్నారు. అల్లు అర్జున్‌ ఏ క్లాసులకు వెళ్తున్నారు అనుకుంటున్నారా? హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో చేస్తోన్న ‘దువ్వాడ జగన్నాథమ్‌’లో అల్లు అర్జున్‌ బ్రహ్మణ యువకుడిగా నటిస్తున్నారు.

పాత్రకు అనుగుణంగా భాషలో పర్‌ఫెక్షన్‌ చూపడం కోసమే క్లాసులు చెప్పించుకుంటున్నారు. ‘దిల్‌’ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమా తాజా షెడ్యూల్‌ రేపట్నుంచీ మొదలు కానుంది. ఈ సినిమా సంగతి పక్కన పెడితే... గూగుల్‌లో ‘మోస్ట్‌ సెర్చ్‌డ్‌’ తెలుగు హీరోగా అల్లు అర్జున్‌ నిలిచారని ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. ట్విట్టర్, ఫేస్‌బుక్‌లో బన్నీని లక్షల్లో ఫాలో అవుతున్న అభిమానులు ఉన్నారు. ఫేస్‌బుక్‌లో 1 కోటీ 18 లక్షల మంది ట్విట్టర్‌లో 10 లక్షల మంది బన్నీని ఫాలో అవుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement