త్రివిక్రమ్‌ అడిగాడు.. బన్నీ చేస్తున్నాడు!

Allu Arjun Losing Weights For Trivikram Movie - Sakshi

‘నా పేరు సూర్య’ సినిమాతో చేతులు కాల్చుకున్నాడు స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌. ఈ మూవీ విడుదలైన చాలారోజులకు ఈ హీరో మరో సినిమాను పట్టాలెక్కిస్తున్నాడు. జులాయి, సన్నాఫ్‌ సత్యమూర్తి లాంటి హిట్లు ఇచ్చిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో బన్నీ ఓ ప్రాజెక్ట్‌ను చేస్తున్న సంగతి తెలిసిందే.

హ్యాట్రిక్‌పై గురి పెట్టిన ఈ కాంబినేషన్‌పై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. అయితే ఈ సినిమా కోసం గురూజీ బన్నీ లుక్‌పై శ్రద్దపెట్టాడట. ఈ మూవీ కోసం బరువు తగ్గి స్లిమ్‌గా మారాలని బన్నీకి సూచించాడట.. అందుకు తగ్గట్టు బన్నీ కూడా శ్రమిస్తున్నట్లు సమాచారం. గీతా ఆర్ట్స్‌, హారిక హాసిని క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top