సరైనోడి ఖాతాలో మరో రికార్డ్ | allu arjun creates record in Rayalaseema | Sakshi
Sakshi News home page

సరైనోడి ఖాతాలో మరో రికార్డ్

May 14 2016 1:07 PM | Updated on Sep 4 2017 12:06 AM

సరైనోడి ఖాతాలో మరో రికార్డ్

సరైనోడి ఖాతాలో మరో రికార్డ్

సమ్మర్ సీజన్లో భారీ బ్లాక్ బస్టర్గా నిలిచిన సినిమా సరైనోడు. అల్లు అర్జున్ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్, కలెక్షన్ల విషయంలో సరికొత్త రికార్డ్లు...

సమ్మర్ సీజన్లో భారీ బ్లాక్ బస్టర్గా నిలిచిన సినిమా సరైనోడు. అల్లు అర్జున్ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్, కలెక్షన్ల విషయంలో సరికొత్త రికార్డ్లు క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే వందకోట్ల వసూళ్లతో టాలీవుడ్ టాప్ గ్రాసర్స్ సరసన స్థానం సంపాదించిన ఈ సినిమా, 60 కోట్ల షేర్తో బన్నీ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డ్ సృష్టించింది.

తాజాగా మరో అరుదైన రికార్డ్ సరైనోడి సొంతమైంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు సీడెడ్లో 10 కోట్ల కలెక్షన్లు సాధించిన సినిమాలు చాలా తక్కువ. మగధీర, అత్తారింటికి దారేది, బాహుబలి లాంటి సినిమాలు మాత్రమే రాయలసీమలో పది కోట్ల షేర్ వసూళు చేశాయి. అలాంటిది తాజాగా సరైనోడు సినిమాతో అల్లు అర్జున్, ఈ ఫీట్ను సాధించాడు. అంతేకాదు ఇప్పటికీ మంచి వసూళ్లను సాధిస్తూ సరికొత్త రికార్డ్ దిశగా దూసుకుపోతున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement