అల్లు అర్హకు బర్త్‌డే శుభాకాంక్షలు

Allu Arjun Celebrates His Daughter Allu Arha 3rd Birthday - Sakshi

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, స్నేహారెడ్డిల గారాలపట్టి అల్లు అర్హ మూడోయేట అడుగుపెట్టింది. ఈ సందర్భంగా కూతురి పుట్టినరోజు వేడుకలను బన్నీ ఘనంగా నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫొటోను సోషల్‌ మీడియాలో పంచుకున్నాడు. ఇందులో అర్హ క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్‌తో ముద్దులొలికిస్తోంది. పలువురు సెలబ్రిటీలు ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అర్హ బర్త్‌డే సందర్భంగా బన్నీ అభిమానులు సేవాకార్యక్రమాలు చేపట్టారు. కాగా అర్హ తన డాడీ మీద చాడీలు చెబుతూ ‘ఓ మై గాడ్‌ డాడీ’ సాంగ్‌ మేకింగ్‌ వీడియోలో నటించిన సంగతి తెలిసిందే. ఇందులో బన్నీ పిల్లలు అర్హ, అయాన్‌ కలిసి నటించారు. పూర్తి పాట రేపు విడుదల కానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top