అల్లు అర్జున్ చాలా కష్టపడ్డారు.. వైరల్ | Allu Arjun Cap Tricks Viral Video | Sakshi
Sakshi News home page

అల్లు అర్జున్ చాలా కష్టపడ్డారు.. వైరల్

May 2 2018 6:21 PM | Updated on May 2 2018 8:16 PM

Allu Arjun Cap Tricks Viral Video - Sakshi

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ  'నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా'. ఈ మూవీ కోసం బన్నీ పడ్డ కష్టానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదే క్యాప్ ట్రిక్. లవర్ ఆల్సో.. ఫైటర్ ఆల్సో అనే పాట కోసం బన్నీ ఎంతగానో శ్రమించారు. ఎందుకంటే అందులో క్యాప్‌తో చేసే చిన్న గిమ్మిక్కుల కోసం, సీన్ ఫర్ఫెక్ట్‌గా రావడానికి బన్నీ యత్నించారు. ఏడాది సమయం పట్టే ఎన్నో ట్రిక్కులను బన్నీ హార్డ్‌వర్క్‌తో కేవలం రెండు నెలల సమయంలోపే నేర్చుకున్నారంటూ యూనిట్ పేర్కొంది.

దీనిపై దర్శకుడు వక్కంతం వంశీ, ఇతర యూనిట్ మాట్లాడుతూ బన్నీ నిబద్ధతను కొనియాడారు. ప్రతిరోజు షూటింగ్ అయిపోవడం. ప్రతిరోజూ షూటింగ్ అయిపోగానే అల్లు అర్జున్ క్యాప్ ట్రిక్ ట్రై చేయడం. అది కేవలం ట్రిక్ కాదండీ. అల్లు అర్జున్ రెండు నెలల కష్టమండీ. ఈ క్యాప్ ట్రిక్ కోసం ఆయన ఎంత కష్టపడ్డారో నాకు తెలుసునండీ అని వక్కంతం వంశీ అన్నారు. లగడపాటి శ్రీధర్‌, నాగబాబు సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ మే 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. బన్నీ క్యాప్‌ ట్రిక్స్ వీడియో మీ కోసం..



Advertisement
Advertisement
 
Advertisement
Advertisement