ప్రియా ప్రకాష్‌లా బన్నీ..! | Allu Arjun And Son Ayaan Recreate Manikya Malaraya Scene | Sakshi
Sakshi News home page

Feb 24 2018 4:09 PM | Updated on Feb 24 2018 8:26 PM

Allu Arjun Allu Ayaan - Sakshi

కొడుకు అల్లు అయాన్‌తో అల్లు అర్జున్‌

సినిమాలు, షూటింగ్‌లతో ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీకి కూడా సమయం కేటాయిస్తూ ఉంటాడు యంగ్ హీరో అల్లు అర్జున్‌. ఏ మాత్రం గ్యాప్ దొరికినా ఫ్యామిలీతో ఉండేందుకే ఇష్టపడే బన్నీ తన చిన్నారులతో కలిసి అల్లరి చేస్తుంటాడు. బన్నీ పిల్లలతో చేసే అల్లరి ఎప్పటికప్పుడు తన సోషల్‌ మీడియా పేజ్‌ లో షేర్‌ చేస్తుంటుంది అల్లు అర్జున్‌ భార్య స్నేహ. తాజాగా స్నేహ పోస్ట్‌ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఇటీవల సంచలనం సృష్టించిన మలయాళ చిత్రం ఒరు ఆదార్‌ లవ్‌ లోని ఓ సన్నివేశం నాకు బాగా నచ్చిందంటూ బన్నీ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ సన్నివేశానికి స్పూఫ్‌ చేశాడు స్టైలిష్ స్టార్‌. హీరోయిన్‌ ప్రియా ప్రకాష్‌ వారియర్‌ చేసినట్టుగానే చేతితో తన కొడుకును షూట్‌ చేయటం, బన్నీ కొడుకు అయాన్ అమాంతం బెడ్ మీద పడిపోవటాన్ని వీడియో తీసిన స్నేహ తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియోకు స్టైలిష్ స్టార్‌ ఫ్యాన్స్‌ నుంచి సూపర్బ్‌ రెస్పాన్స్‌ వస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement