‘స్టైల్‌గా ఉంది కదా.. నాక్కూడా నచ్చింది’ | Allu Arjun Ala Vaikunthapurramuloo Telugu Movie Teaser Out | Sakshi
Sakshi News home page

‘మీరిప్పుడే కారు దిగారు.. నేనిప్పుడే క్యారెక్టర్‌ ఎక్కా’

Dec 11 2019 4:31 PM | Updated on Dec 11 2019 4:49 PM

Allu Arjun Ala Vaikunthapurramuloo Telugu Movie Teaser Out - Sakshi

మీ నాన్నా పెళ్లి కూతురిని దాచినట్టు దాచాడు నిన్ను, మీరిప్పుడే కారు దిగారు.. నేనిప్పుడే క్యారెక్టర్‌ ఎక్కా

సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘అల.. వైకుంఠపురములో’ టీజర్‌ వచ్చేసింది. ఊహించినట్టే అల్లు అర్జున్‌ మార్క్‌ స్టైల్‌.. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ పవర్ ఫుల్‌ అండ్‌ కామెడీ పంచ్‌లతో టీజర్‌ సూపర్బ్‌గా ఉండటంతో క్షణాల్లోనే నెట్టింట్లో తెగ వైరల్‌గా మారింది. అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేలా ఉన్న ఈ చిన్న టీజర్‌ను చూస్తుంటే సినిమా భారీ హిట్‌ సాధించడం ఖాయంలా కనిపిస్తోందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ‘మీ నాన్నా  పెళ్లి కూతురిని దాచినట్టు దాచాడు నిన్ను’అంటూ మొదలైన టీజర్‌ ఒక నిమిషం 23 సెకన్ల పాటు సాగింది. ‘స్టైల్‌గా ఉంది కదా.. నాక్కూడా నచ్చింది’, ‘సమ్‌థింగ్‌ కంప్లీట్‌ అవ్వట్లేదు.. ఇన్ని పాటలతో ప్యాకప్‌ చేశాక.. డైలాగ్‌ లేదనా’, ‘మీరిప్పుడే కారు దిగారు.. నేనిప్పుడే క్యారెక్టర్‌ ఎక్కా’ అంటూ బన్నీ చెప్పే డైలాగ్‌లు తెగ ఆకట్టుకుంటున్నాయి.  

'జులాయి', 'సన్నాఫ్‌ సత్యమూర్తి' చిత్రాల తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌, స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో వస్తున్న ఈ మూడో చిత్రంపై అందరిలోనూ భారీ అంచనాలే ఉన్నాయి. ఈ అంచనాలకు తోడు ఇప్పటికే విడుదలైన పాటల పాపులార్టీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.   అల్లు అర్జున్ 19వ చిత్రంగా తెరకెక్కుతున్న  ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ చిత్రంలో భారీ తారగణం కనిపించనున్నారు. టబు, సుశాంత్‌, నవదీప్‌, జయరామ్‌, సముద్రఖని, మురళీ శర్మ, నివేతా పేతురాజు తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి థమన్‌ సంగీతం అందిస్తున్నాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement