ఆకాశంలో అల్లరి సెల్ఫీ | Allari Naresh as Selfie Raja | Sakshi
Sakshi News home page

ఆకాశంలో అల్లరి సెల్ఫీ

Jun 10 2016 11:15 PM | Updated on Sep 4 2017 2:10 AM

ఆకాశంలో అల్లరి సెల్ఫీ

ఆకాశంలో అల్లరి సెల్ఫీ

వినోదభరిత చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే కథానాయకుడు ‘అల్లరి’ నరేశ్. తొలి చిత్రం ‘అల్లరి’ నుంచి గత ఏడాది వచ్చిన...

వినోదభరిత చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే కథానాయకుడు ‘అల్లరి’ నరేశ్. తొలి చిత్రం ‘అల్లరి’ నుంచి గత ఏడాది వచ్చిన ‘మామ మంచు అల్లుడు కంచు’ వరకూ వినోదాన్నే నమ్ముకుని ప్రేక్షకులకు కితకితలు పెడుతున్నారాయన. నరేశ్ నటిస్తున్న తాజా చిత్రం ‘సెల్ఫీ  రాజా’. సుంకర రామబ్రహ్మం సమర్పణలో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ‘సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం’ ఫేం జి.ఈశ్వర్ దర్శకత్వంలో గోపీ ఆర్ట్స్ పతాకంపై చలసాని రామబ్రహ్మం చౌదరి ఈ చిత్రం నిర్మిస్తున్నారు.

శుక్రవారం ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ జయంతి సందర్భంగా ‘సెల్ఫీ రాజా’ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఫస్ట్ లుక్ చూస్తే సెల్ఫీ మోజులో నరేశ్ ఆకాశంలోకి ఎగిరి మరీ సెల్ఫీ తీసుకుంటున్నట్లు స్పష్టం అవుతోంది. సెల్ఫీ అంటే మనోడికి అంత మోజని అర్థమవుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement