‘సిల్లీ ఫెలోస్‌’కే ఫిక్స్‌ అయ్యారు..!

Allari Naresh And Sunil New Movie Silly Fellows - Sakshi

వరుస పరాజయాలతో కష్టాల్లో పడ్డ యంగ్ హీరో నరేష్‌, ప్రస్తుతం జాగ్రత్తగా సినిమాలు చేస్తున్నాడు. తనకు చివరి హిట్‌ సుడిగాడు సినిమాను అందించిన భీమినేని శ్రీనివాస్‌ దర‍్శకత్వంలో ఓ కామెడీ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నాడు‌. మల్టీస్టారర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నరేష్‌ తో పాటు మరో కామెడీ హీరో సునీల్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాకు టైటిల్‌పై కొద్ది రోజులగా చర్చ జరుగుతోంది.

చాలా టైటిల్స్‌ను పరిశీలించిన తరువాత ఫైనల్‌గా ‘సిల్లీ ఫెలోస్‌’ టైటిల్‌కు ఫిక్స్‌ అయ్యారు చిత్రయూనిట్‌. ఇద్దరు టాప్ కామెడీ స్టార్‌లు కలిసి నటిస్తుండటంతో సినిమాలో వినోదానికి డోకా లేదని తెలుస్తోంది. ఇద్దరు హీరోలతో పాటు దర్శకుడు భీమినేని కెరీర్‌కు కూడా ఈ సినిమా విజయం ఎంతో కీలకం. బ్లూ ప్లానెట్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌, పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో పూర్ణ, చిత్ర శుక్లాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top