టాటా.. బై బై | Alia Bhatt, Varun Dhawan wrap up Kalank | Sakshi
Sakshi News home page

టాటా.. బై బై

Jan 20 2019 1:51 AM | Updated on Jan 20 2019 1:51 AM

Alia Bhatt, Varun Dhawan wrap up Kalank - Sakshi

వరుణ్‌ ధావన్‌, ఆలియా భట్‌

‘కళంక్‌’ టీమ్‌కు టాటా చెప్పేశారు వరుణ్‌ ధావన్‌. ‘2 స్టేట్స్‌’ ఫేమ్‌ అభిషేక్‌ వర్మన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మాధురీ దీక్షిత్, సంజయ్‌ దత్, వరుణ్‌ ధావన్, ఆదిత్యారాయ్‌ కపూర్, ఆలియా భట్, సోనాక్షీ సిన్హా ముఖ్య తారలుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో తన షూటింగ్‌ పూర్తి చేసినట్లు వరుణ్‌ ధావన్‌ పేర్కొన్నారు. ‘‘ఇప్పటి వరకు నేను నటించిన వాటిలో పెద్ద సినిమా ఇది. నిజంగా చాలా కష్టపడ్డాను. సోనా, మాధురీ మేడమ్, సంజు సార్, ఆలియా మేడమ్‌లతో నేను బిగ్‌ స్క్రీన్‌ని షేర్‌ చేసుకోవడం హ్యాపీగా ఉంది.

ఆలియా భట్‌తో నాలుగోసారి నటించడం సూపర్‌ ఎగై్జటింగ్‌గా అనిపించింది’’ అని పేర్కొన్నారు వరుణ్‌. ‘‘హార్డ్‌వర్క్‌తో వరుణ్‌ ఎప్పటికప్పుడు సర్‌ప్రైజ్‌ చేస్తుంటాడు. ‘కళంక్‌’ సెట్‌లోనూ అదే చేశాడు. ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’ అని ఆలియా పేర్కొన్నారు. ‘కళంక్‌’ సినిమా ఈ ఏడాదే రిలీజ్‌ కానుంది. ఈ సంగతి ఇలా ఉంచితే... 1994లో వచ్చిన ‘అందాజ్‌ అప్నా అప్పా’ సినిమా రీమేక్‌ లేదా సీక్వెల్‌లో వరుణ్‌ ధావన్, రణ్‌వీర్‌ సింగ్‌ నటించనున్నారనే ప్రచారం బాలీవుడ్‌లో జరుగుతోంది.
 

Advertisement
 
Advertisement
Advertisement