 
															హాట్... హాట్‌గా అలియా!
‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్’ చిత్రంలో ఆలియా భట్ అందాలు చూసి ఫ్లాట్ కాని కుర్రకారు లేరేమో. దర్శక, నిర్మాత కరణ్‌జోహార్ తెరకెక్కించిన ఆ చిత్రం
	‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్’ చిత్రంలో ఆలియా భట్ అందాలు చూసి ఫ్లాట్ కాని కుర్రకారు లేరేమో. దర్శక, నిర్మాత కరణ్‌జోహార్ తెరకెక్కించిన ఆ  చిత్రం మంచి విజయం సాధించింది. ఆలియా భట్ గ్లామర్ కూడా ఆ  సినిమా విజయంలో కీలక పాత్ర పోషించిందనడంలో అతిశయోక్తి కాదేమో. ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్’ మొదటి చిత్రమైనా ఆలియా భట్ బికినీలో అందాలు ఒలికించడానికి  ఏమాత్రం వెనుకాడలేదు.  ఇప్పుడు మళ్లీ కరణ్ జోహార్ నిర్మిస్తున్న ‘షాన్ దార్’ చిత్రంలో ఆలియా బికినీలో ప్రేక్షకులను కనువిందు చేయనున్నారు. ‘క్వీన్’ ఫేం వికాస్ బెహల్ దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో షాహిద్‌కపూర్ హీరోగా నటిస్తున్నారు.
	 

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
