ఫుల్‌ స్పీడ్‌ | Ala vaikunta puram lo shooting in hyderabad | Sakshi
Sakshi News home page

ఫుల్‌ స్పీడ్‌

Aug 31 2019 12:02 AM | Updated on Aug 31 2019 12:02 AM

Ala vaikunta puram lo shooting in hyderabad - Sakshi

సగానికి పైనే ప్రయాణాన్ని పూర్తి చేసింది ‘అల వైకుంఠపురములో’ టీమ్‌. మిగతా భాగాన్ని కూడా ఫుల్‌ స్పీడ్‌లో పూర్తి చేస్తోంది. అల్లు అర్జున్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అల వైకుంఠపురములో’. అల్లు అరవింద్, యస్‌. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. పూజాహెగ్డే కథానాయిక. టబు, జయరామ్, నివేదా పేతురాజ్, సుశాంత్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ప్రత్యేకంగా వేసిన ఇంటి సెట్లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని తెలిసింది. ఈ షెడ్యూల్‌ మరికొన్ని రోజులు సాగుతుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్‌ కానున్న ఈ సినిమాకు తమన్‌ సంగీత దర్శకుడు.

Advertisement
 
Advertisement
Advertisement