నో క్లాష్‌ | Akshay postpones Bachchan Pandey release after Aamirkhan film | Sakshi
Sakshi News home page

నో క్లాష్‌

Jan 28 2020 3:27 AM | Updated on Jan 28 2020 3:27 AM

Akshay postpones Bachchan Pandey release after Aamirkhan film - Sakshi

బెల్‌బాటమ్‌ పోస్టర్, లాల్‌సింగ్‌ చద్దా పోస్టర్, బచ్చన్‌ పాండే పోస్టర్‌

పండగ సీజన్లో రెండుమూడు సినిమాలు రిలీజ్‌ ప్లాన్‌ చేసుకోవడం సహజం. పండగ సెలవులను క్యాష్‌ చేసుకోవాలని నిర్మాతలు భావిస్తారు. అలా ఈ ఏడాది క్రిస్మస్‌కి ఆమిర్‌ఖాన్‌ ‘లాల్‌ సింగ్‌ చద్దా’, అక్షయ్‌ కుమార్‌ ‘బచ్చన్‌ పాండే’ విడుదలకు సిద్ధమయ్యాయి. దాంతో బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌ ఉంటుందని ఊహించారందరూ. అయితే ఈ క్లాష్‌ తప్పింది. ‘బచ్చన్‌ పాండే’ టీమ్‌ను ఆమిర్‌ఖాన్‌ రిక్వెస్ట్‌ చేయడంతో అక్షయ్‌ తన సినిమాను జనవరిలో రిలీజ్‌ చేయాలని నిశ్చయించుకున్నారు. ‘‘కొన్నిసార్లు ఒక్క సంభాషణ చాలు  పరిష్కరించుకోవడానికి.

నా విన్నపాన్ని మన్నించి వాళ్ల సినిమా విడుదల తేదీ మార్చుకుంటున్నందుకు అక్షయ్‌ కుమార్, నిర్మాత సాజిద్‌ నడియాడ్‌వాలాకి థ్యాంక్స్‌. వాళ్ల సినిమాకు ఆల్‌ ది బెస్ట్‌’’ అని ట్వీట్‌ చేశారు ఆమిర్‌.  ‘‘నీ కోసం ఎప్పుడైనా ఏమైనా చేయడానికి రెడీ ఆమిర్‌. మనం స్నేహితులం’’ అని సమాధానం ఇచ్చారు అక్షయ్‌. అలాగే ‘బచ్చన్‌ పాండే’ను 2021 జనవరి 22న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. విశేషం ఏంటంటే అదే రోజు అక్షయ్‌ కుమార్‌ డిటెక్టివ్‌ థ్రిల్లర్‌ ‘బెల్‌ బాటమ్‌’ విడుదల కావాల్సింది. ‘‘నేను నటించిన రెండు సినిమాలు ఒకేరోజు విడుదలవుతాయని జోక్స్‌ చేసుకుంటున్నారా? ‘బచ్చన్‌ పాండే’ కోసం ‘బెల్‌ బాటమ్‌’ను 2021 ఏప్రిల్‌ 2న రిలీజ్‌ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు అక్షయ్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement