తిరిగొచ్చి తిప్పలు పెడతారు | Akshay Kumar shares the first motion poster of Housefull 4 | Sakshi
Sakshi News home page

తిరిగొచ్చి తిప్పలు పెడతారు

Sep 26 2019 12:38 AM | Updated on Sep 26 2019 12:38 AM

Akshay Kumar shares the first motion poster of Housefull 4 - Sakshi

అక్షయ్‌కుమార్

1419వ సంవత్సరంలో క్రూరమైన ఆలోచనలున్న రాజకుమారుడు బాలా. అదే రూపంతో 2019లో అమాయకపు హ్యారీగా పుడతాడు. ఆరొందల ఏళ్ల బాలా ఆత్మ హ్యారీను ఎలాంటి ఇబ్బందుల్లో పడేసిందో తెలియాలంటే ఆ క్రేజీ హౌస్‌లోకి ఎంటర్‌ కావాల్సిందే. అక్షయ్‌కుమార్, రితేశ్‌ దేశ్‌ముఖ్, బాబీ డియోల్, రానా, పూజా హెగ్డే, కృతీ సనన్, కృతీ కర్భందా ముఖ్యపాత్రల్లో ఫర్హాద్‌ సంజీ రూపొందించిన కామెడీ చిత్రం ‘హౌస్‌ఫుల్‌ 4’.

హౌస్‌ఫుల్‌ ఫ్రాంచైజీలో నాలుగో చిత్రం ఇది. ఈ సినిమా కథాంశం పునర్జన్మల చుట్టూ తిరుగుతుంది. ఇందులోని ప్రతి పాత్రకి 600 ఏళ్ల క్రితం పాత్రలతో సంబంధం ఉంటుందట. వాళ్లందరూ ఆత్మల రూపంలో తిరిగొచ్చి తిప్పలు పెడతారట. ఈ సినిమాలో నటీనటుల లుక్స్‌ను రిలీజ్‌ చేశారు అక్షయ్‌ కుమార్‌. రాజకుమారుడు బాలా, లండన్‌ రిటర్న్‌ హ్యారీగా రెండు లుక్స్‌లో అక్షయ్‌ కనిపిస్తారు. అక్షయే కాదు సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ రెండు పాత్రల్లో కనిపించనున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement