మార్పు చేయాల్సిందే! | Akshay Kumar may star in Hindi remake of 'Kaththi' | Sakshi
Sakshi News home page

మార్పు చేయాల్సిందే!

Jun 1 2016 12:58 AM | Updated on Sep 4 2017 1:21 AM

మార్పు చేయాల్సిందే!

మార్పు చేయాల్సిందే!

విజయ్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘కత్తి’ ఘనవిజయం సాధించిన విషయం, ఆ చిత్రం తెలుగు రీమేక్‌లో

విజయ్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘కత్తి’ ఘనవిజయం సాధించిన విషయం, ఆ చిత్రం తెలుగు రీమేక్‌లో మెగాస్టార్ చిరంజీవి నటించనున్న విషయం తెలిసిందే. తెలుగుకి అనుగుణంగా కథలో మార్పులు చేశారు. కాగా, ‘కత్తి’ చిత్రం హిందీ రీమేక్‌లో నటించడానికి అక్షయ్ కుమార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆయన అంగీకరించి, ఏడాది పైనే అయ్యింది. హిందీకి తగ్గట్టుగా కథను మార్చమని దర్శకుడు మురుగదాస్‌తో అక్షయ్ చెప్పారట. ఆ మార్పులు సంతృప్తికరంగా అనిపిస్తే అప్పుడు చిత్రీకరణ మొదలుపెడదామని అన్నారట.

Advertisement
 
Advertisement
Advertisement