‘హలో’ చిత్రం ట్రైలర్‌ వచ్చేసింది..!‌

Akkineni Akhil Hello movie Trailer released - Sakshi

‘హలో ఈ అబ్బాయి పేరు అవినాశ్‌.. ఒకప్పుడు ఇతడ్ని శ్రీను అని పిలిచేవారు.. ఎవరు లేని  శ్రీను లైఫ్‌లోకి అనుకోకుండా తన సోల్‌మేట్‌ వచ్చింది. అది అతడికి తెలిసే లోపు దూరమైపోయింది. అన్ని మనం అనుకున్నట్లు జరిగితే దేవుడికి బోర్‌ కొట్టేది. అవినాశ్‌గా మారిన శ్రీనుకి ఈ రోజు చాలా ఇంపార్ట్‌టెంట్‌ డే.. అనుకొని సంఘటనలు ఇతని లైఫ్‌ను ఏలా మార్చబోతున్నాయో’ అని నాగార్జున అఖిల్‌ను పరిచయం చేశారు. అక్కినేని అఖిల్‌ హీరోగా నటిస్తున్న ‘హలో’  సినిమాకి విక్రమ్‌ కె. కుమార్‌ డైరెక్టర్‌.  ‘హలో’ సినిమా ట్రైలర్‌ను శుక్రవారం విడుదల చేశారు.

‘పదిహేను ఏళ్లుగా ఒక్క అమ్మాయి కోసం ఎదురుచూస్తున్న నీకు పిచ్చిరా.. మరచిపోవాలి రా’ అని రమ్యకృష్ణ అంటోంది. అప్పుడు అఖిల్‌..‘ అమ్మా తను నా సోల్‌మేట్‌ మా’  అని చెప్పే విధానం అందర్నీ ఆకట్టుకునేలా ఉంది. ‘నేను ఎవరికైనా దగ్గరవ్వలంటే చాలా రోజుల పడుతోంది .. ఎంటో చాలా దగ్గరయ్యాను.. అమ్మకు చెప్పవు కదా నీ లైఫ్‌లో ఒక్కరు ఉన్నారిని.. అలానే నా లైఫ్‌లో ఒక్కరున్నారు’  అని రమ్యకృష్ణతో అంటారు. ‘ ఇదంతా వాడు.. ఫోన్‌ కోసమా !’  అని నటుడు అజయ్‌ ఆశ్యర్యపోతూ కనిపించారు. 

ఈ ట్రైలర్‌లో వారి సంభాషణ విన్న తర్వాత లవ్‌ స్టోరీతో తెరకెక్కించినట్లు అర్థమౌతోంది. నాగార్జున ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో అఖిల్ సరసన కల్యాణి హీరోయిన్‌గా నటిస్తోంది. గతంలో నాగార్జున ఈ చిత్రాన్ని డిసెంబరు 22న ప్రేక్షకుల ముందు తీసుకురావడానికి ట్రై చేస్తున్నట్లు ప్రకటించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top