‘హలో’ కోలీవుడ్‌..! | Akkineni Akhil Hello Movie Releasing In Tamil Version | Sakshi
Sakshi News home page

Dec 4 2018 10:53 AM | Updated on Dec 4 2018 10:57 AM

Akkineni Akhil Hello Movie Releasing In Tamil Version - Sakshi

అక్కినేని వారసుడు అఖిల్‌కు కాలం కలిసిరావడం లేదు. ‘అఖిల్‌’ సినిమాతో గ్రాండ్‌గా ఎంట్రీ ఇద్దామనుకుంటే.. అది కాస్తా బెడిసికొట్టింది. రెండో సినిమాకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుని.. ‘హలో’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తే.. అందరినీ ఆకట్టుకోలేకపోయింది. 

ప్రస్తుతం ఆచితూచి చేస్తున్న మూడో చిత్రం ‘మిస్టర్‌. మజ్ను’తోనైనా సక్సెస్‌ కొట్టాలని అఖిల్‌ ఆశపడుతున్నాడు. అయితే ఇప్పడు ‘హలో’ సినిమాకు సంబంధించి ఓ వార్త బయటకు వచ్చింది. ఈ సినిమాను డబ్‌చేసి తమిళనాట రిలీజ్‌ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. మరి ఇక్కడే మెప్పించలేకపోయిన సినిమా అక్కడ ఎలాంటి మ్యాజిక్‌ చేయనుందో చూడాలి. 

Advertisement
 
Advertisement
Advertisement