breaking news
dubbed
-
తెలుగులో చావా కలెక్షన్ల మోత
-
‘అనువాదం’ బొమ్మ అదిరింది
కథ బాగుందా? బొమ్మ (సినిమా) అనువాదం అయినా తెలుగు ప్రేక్షకులు అదిరిపోయే వసూళ్లు ఇస్తారు. అలా ఈ ఏడాది డబ్బింగ్ బొమ్మల వసూళ్లు బాగానే ఉన్నాయి. కొన్ని భారీ వసూళ్లు సాధిస్తే.. కొన్ని ఫర్వాలేదనిపించుకున్నాయి. కొన్ని చిత్రాలు నిరాశపరిచాయి. ఏది ఏమైనా ఈ ఏడాది అనువాదం బొమ్మ అదిరిందనే చెప్పాలి. ఆ విశేషాల్లోకి... మాతృక హిట్.. అనువాదం ఫట్ తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో హిట్‌గా నిలిచిన పలు చిత్రాలు తెలుగులో ఫర్వాలేదనిపించుకున్నాయి. కొన్ని మాతృకలో హిట్టయినా, ఇక్కడ ఆశించిన ఫలితం సాధించలేకపోయాయి. విశాల్ ‘మార్క్ ఆంటోనీ’, అదా శర్మ ‘ది కేరళ స్టోరీ’, ఎస్.జె. సూర్య, రాఘవా లారెన్స్‌ల ‘జిగర్తాండ డబుల్ ఎక్స్’, రక్షిత్‌శెట్టి ‘సప్తసాగరాలు దాటి’ రెండు భాగాలు, దుల్కర్ సల్మాన్ ‘కింగ్ ఆఫ్ కోత, కార్తీ ‘జపాన్’, రాఘవా లారెన్స్ ‘చంద్రముఖి 2’, శివ రాజ్‌కుమార్ ‘ది ఘోస్ట్’, రిషబ్ శెట్టి ‘బాయ్స్ హాస్టల్’, పూ రాము, కాళీ వెంకట్ కీలక పాత్రల్లో నటించిన ‘దీపావళి’ వంటి చిత్రాలు మాతృకలో ఫర్వాలేదనిపించినా తెలుగులో ఆశించిన స్థాయిలో ప్రేక్షకాదరణపోందలేకపోయాయి. సల్మాన్ ఖాన్ ‘టైగర్ 3’, టైగర్ ష్రాఫ్ ‘గణపథ్’, వంటి హిందీ చిత్రాలు తెలుగులో హిట్ టాక్ని సొంతం చేసుకోలేక పోయాయి. జైలర్ రజనీకాంత్‌కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే ఇటీవల ఆశించిన విజయాలు ఇవ్వకుండా ఫ్యాన్స్‌ను నిరుత్సాహపరిచిన ఆయన ‘జైలర్’తో మళ్లీ హిట్ ట్రాక్‌లోకి వచ్చేశారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రజనీకాంత్, రమ్యకృష్ణ జోడీగా నటించారు. ఈ మూవీలో జైలర్ ముత్తువేల్ పాండ్యన్‌గా రజనీ నటించారు. కళానిధి మారన్ నిర్మించిన ఈ చిత్రంలో మోహన్ లాల్, జాకీ ష్రాఫ్, శివరాజ్‌కుమార్ వంటి స్టార్స్ అతిథి పాత్రల్లో అలరించారు. తెలుగు, తమిళ భాషల్లో ‘జైలర్’ సూపర్ హిట్. వారసుడు.. లియో విజయ్ హీరోగా నటించిన తమిళ చిత్రం ‘వారిసు’. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్, పరమ్ వి.పోట్లూరి, పెరల్ వి.పోట్లూరి నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి రేస్‌లో జనవరి 11న తమిళంలో రిలీజైంది. ‘వారసుడు’ పేరుతో తెలుగులోకి అనువదించి, సంక్రాంతి పోటీలోనే జనవరి 14న రిలీజ్ చేశారు. తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచిన ఈ మూవీ తెలుగులోనూ హిట్‌గా నిలిచింది. ఇక విజయ్ నటించిన మరో చిత్రం ‘లియో’. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ తెలుగులో డబ్ చేసి, అక్టోబర్ 19నే రిలీజ్ చేశారు. తెలుగులో ‘లియో’ టైటిల్‌పై వివాదం చెలరేగినా, ఆ తర్వాత సద్దుమణిగింది. తమిళంలో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ‘లియో’ తెలుగులోనూ మంచి వసూళ్లు రాబట్టింది. పొన్నియిన్ సెల్వన్–2 కల్కి కృష్ణమూర్తి నవలపోన్ని యిన్ సెల్వన్ ఆధారంగా దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన చిత్రం పొన్నియిన్ సెల్వన్ 1’. చోళ సామ్రాజ్యం నేపథ్యంలో సాగే కథ ఇది. విక్రమ్, ఐశ్వర్యా రాయ్, త్రిష, కార్తీ, ‘జయం’ రవి, శోభిత ధూళిపాళ్ల, ప్రకాశ్‌రాజ్, శరత్‌కుమార్ కీలక పాత్రల్లో నటించారు. మణిరత్నం, సుభాస్కరన్ నిర్మాతలు. రెండు భాగాలుగా రూపొందిన ఈ సినిమా తొలి భాగం గత ఏడాది విడుదలై, తమిళ్, తెలుగు భాషల్లో హిట్ అయింది. పొన్నియిన్ సెల్వన్ 2’ ఈ ఏడాది ఏప్రిల్ 28న రిలీజైంది. తెలుగులో నిర్మాత ‘దిల్’ రాజు రిలీజ్ చేయగా మంచి వసూళ్లు రాబట్టింది. పఠాన్.. జవాన్ ‘జీరో’ (2018) సినిమా తర్వాత దాదాపు నాలుగేళ్లు గ్యాప్ తీసుకుని షారుఖ్ ఖాన్ నటించిన చిత్రం ‘పఠాన్’. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో స్పై యాక్షన్ నేపథ్యంలో ఆదిత్యా చో్రపా నిర్మించిన ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించిన తొలి హిందీ సినిమాగా ‘పఠాన్’ రికార్డులు సృష్టించింది. తెలుగులోనూ ఈ సినిమా హిట్‌గా నిలిచింది. ఇక షారుక్ నటించిన మరో చిత్రం ‘జవాన్’ కూడా తెలుగులో ఓకే అనిపించుకుంది. తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ. 1200 కోట్లు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. షారుక్ నటించిన తాజా చిత్రం ‘డంకీ’ ఈ నెల 21న రిలీజ్ కానుంది. ఈ సినిమా కూడా హిట్ అయితే మూడు విజయాలతో షారుక్ ఈ ఏడాది హ్యాట్రిక్ సాధించినట్లే. యానిమల్ ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన హిందీ చిత్రం ‘యానిమల్’. రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించారు. భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 1న రిలీజైంది. తెలుగులో ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు రిలీజ్ చేశారు. ఈ చిత్రంలోని అడల్ట్ కంటెంట్‌పై కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ అవేవీ వసూళ్లను ఆపలేకపోయాయి. విడుదలైన రోజు నుంచి ఇప్పటికీ భారీ వసూళ్లతో దూసుకెళుతోంది. బిచ్చగాడు 2 విజయ్ ఆంటోని కెరీర్లో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన చిత్రం ‘బిచ్చగాడు’ (‘పిచ్చైకారన్’). శశి దర్శకత్వం వహించిన ఈ సినిమా 2016లో విడుదలై ఘనవిజయం సాధించింది. తెలుగులో ‘బిచ్చగాడు’గా విడుదలై, బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ‘బిచ్చగాడు’ విడుదలైన ఏడేళ్లకు ఈ ఏడాది ‘బిచ్చగాడు 2’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్ ఆంటోని హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం భారీ అంచనాలతో తమిళ, తెలుగు భాషల్లో విడుదలైంది. రిలీజ్ రోజున మిక్డ్స్ టాక్ వచ్చినా, మంచి వసూళ్లు రాబట్టింది. 2018 కేరళప్రాంతంలో 2018లో వచ్చిన వరదల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘2018’. టోవినో థామస్, కుంచకో బోబన్, అపర్ణా బాలమురళి, లాల్, ఆసిఫ్ అలీ నటించారు. జూడ్ ఆంటోని జోసెఫ్ దర్శకత్వం వహించారు. వేణు కున్నప్పిళ్లై, సీకే పద్మ కుమార్, ఆంటోని జోసెఫ్ నిర్మించిన ఈ సినిమా మే 5న ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైంది. రూ. వంద కోట్లు వసూలు చేసిన తొలి మలయాళ చిత్రంగా రికార్డు సృష్టించింది. మలయాళంలో విడుదలైన 20 రోజులకే ఈ చిత్రం తెలుగులోనూ ‘2018’ పేరుతోనే అనువాదం అయింది. నిర్మాత ‘బన్నీ’ వాసు తెలుగులో విడుదల చేయగా, ఇక్కడ కూడా హిట్‌గా నిలిచింది. 2018లో కేరళలో వచ్చిన వరదలు, అప్పుడు ప్రజలు పడ్డ ఇబ్బందులు, భావోద్వేగాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. -
‘హలో’ కోలీవుడ్..!
అక్కినేని వారసుడు అఖిల్‌కు కాలం కలిసిరావడం లేదు. ‘అఖిల్’ సినిమాతో గ్రాండ్‌గా ఎంట్రీ ఇద్దామనుకుంటే.. అది కాస్తా బెడిసికొట్టింది. రెండో సినిమాకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుని.. ‘హలో’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తే.. అందరినీ ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం ఆచితూచి చేస్తున్న మూడో చిత్రం ‘మిస్టర్. మజ్ను’తోనైనా సక్సెస్ కొట్టాలని అఖిల్ ఆశపడుతున్నాడు. అయితే ఇప్పడు ‘హలో’ సినిమాకు సంబంధించి ఓ వార్త బయటకు వచ్చింది. ఈ సినిమాను డబ్చేసి తమిళనాట రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. మరి ఇక్కడే మెప్పించలేకపోయిన సినిమా అక్కడ ఎలాంటి మ్యాజిక్ చేయనుందో చూడాలి. -
నమ్మకం పెరిగింది
ఆర్య, విశాల్, సంతానం, తమన్నా, భాను ముఖ్య తారలుగా ఎం.రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఐశ్వర్యాభిమస్తు’. వరం మాధవి సమర్పణలో శ్రీ శ్రీ శ్రీ శూలినీ దుర్గా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వరం జయంత్ కుమార్ ఈ చిత్రాన్ని శుక్రవారం తెలుగులో విడుదల చేస్తున్నారు. వరం జయంత్ కుమార్ మాట్లాడుతూ – ‘‘లవ్, రొమాన్స్, యాక్షన్, కామెడీ.. ఇలా ప్రేక్షకులకు కావాల్సిన అన్ని ఎమోషన్స్ మా చిత్రంలో ఉన్నాయి. ఆర్య హీరోగా నటిస్తూ, స్వయంగా తమిళ్లో నిర్మించిన చిత్రమిది. అక్కడ మంచి విజయం సాధించింది. తెలుగు ప్రేక్షకులు కచ్చితంగా చూడాల్సిన చిత్రం కావడంతో తెలుగులో రిలీజ్ చేస్తున్నాం. డి. ఇమాన్ పాటలకు మంచి స్పందన వస్తోంది. పాటలు, ట్రైలర్ సినిమాపై క్రేజ్‌ని పెంచాయి. ప్రేక్షకులకు డబ్బింగ్ సినిమా అనే ఫీలింగ్ రాకూడదనే చాలా క్వాలిటీగా డబ్బింగ్ చేయించాం. సెన్సార్ సభ్యులు క్లీన్ యు సర్టిఫికెట్ ఇచ్చి, సినిమా బావుందంటూ ప్రశంసించడంతో సినిమాపై మరింత నమ్మకం పెరిగింది. తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు. -
‘రావణసూరన్’గా ఎన్టీఆర్
తెలుగు హీరోలు ప్రస్తుతం తమ మార్కెట్‌ను పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ తెలుగులోనే కాకుండా మలయాళంలో తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్ ఏర్పరుచుకున్నారు. మిగతా టాలీవుడ్ హీరోలు కూడా తమ చిత్రాలను ఇతర భాషల్లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారు. యంగ్‌టైగర్ ఎన్టీఆర్ కూడా ప్రస్తుతం అదే కోవలో చేరారు. ఇప్పటికే ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ చిత్రం మాలీవుడ్ లో విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. గతేడాది బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన జై లవ కుశ చిత్రం ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఎన్టీఆర్ ఆర్ట్ ప్రొడక్షన్‌పై నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభియానంతో ఆకట్టుకున్నారు. తాజాగా ఈ చిత్రాన్ని మలయాళంలో రిలీజ్ చేయనున్నారు. ఎన్టీఆర్ నటించిన మూడు పాత్రల్లోకెల్లా రావణ పాత్రకు విశేషమైన స్పందన రావడంతో నిర్మాత బి ఉన్ని కృష్ణన్ ఆ పేరు వచ్చేలాగా ‘రావణసూరన్’గా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. -
తమిళనాడు వెళ్లనున్న ‘భరత్’...?
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’ చిత్రం మంచి కలెక్షన్సతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. రాజకీయ నేపథ్యంలో సాగే ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక చెన్నైలోను విడుదలై, అక్కడ కూడా మంచి వసూల్లు సాధించింది. దాంతో ఈ చిత్నాన్ని తమిళంలోను అనువాదించాలని చిత్న నిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం డబ్బింగ్ పనులు ప్రారంభమయ్యాయని, అయితే విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తారని పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే దీని గురించి చిత్ర యూనిట్‌నుంచి ఎటువంటి అధికారిక సమాచారం వెలువడలేదు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మించగా కైరా అద్వానీ కథానాయకిగా నటించారు. -
బాహుబలిని కలవరపెడుతున్న వీరబలి
-
ప్రభాస్‌ని భయపెడుతున్న నిర్మాతలెవరు ?
-
వేశ్యగా నటించనున్న శ్రుతీ హాసన్
ప్రముఖ కథానాయికలంతా వేశ్య పాత్రల్లో రాణించారు. ఆ జాబితాలో శ్రుతీ హాసన్ కూడా ఉన్నారు. కెరీర్ తొలినాళ్లలో ఆమె హిందీలో ‘డి-డే’ అనే సినిమాలో వేశ్యగా నటించారు. తెలుగులో ‘గెలుపు గుర్రం’గా అనువాదమైంది. సి.ఆర్. రాజన్ సమర్పణలో డర్ సినిమా మరియు సురేష్ సినిమా సంయుక్త నిర్మాణంలో సురేష్ దూడల ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు ముందు తీసుకు వస్తున్నారు. మాఫియా నేపథ్యంలో నిఖిల్ అద్వానీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అర్జున్ రామ్‌పాల్, ఇర్ఫాన్‌ఖాన్, రిషికపూర్, అనిల్ కపూర్, నాజర్ ముఖ్య తారలుగా నటించారు. ఈ నెలాఖరున విడుదల కానున్న ఈ సినిమా గురించి సురేష్ దూడల మాట్లాడుతూ -‘‘ఇందులో శ్రుతీ బోల్డ్ అండ్ బ్యూటిఫుల్‌గా కనిపిస్తారు. ఆమె నటించిన వేడి వేడి సన్నివేశాలు ఈ చిత్రానికే ప్రధాన ఆకర్షణ’’ అని తెలిపారు.