అఖిల్ అదే తప్పు చేస్తున్నాడా..? | Akkineni Akhil Doing Same mistake | Sakshi
Sakshi News home page

అఖిల్ అదే తప్పు చేస్తున్నాడా..?

Apr 12 2017 11:14 AM | Updated on Jul 15 2019 9:21 PM

అఖిల్ అదే తప్పు చేస్తున్నాడా..? - Sakshi

అఖిల్ అదే తప్పు చేస్తున్నాడా..?

అక్కినేని నటవారసుడిగా భారీ అంచనాల మధ్య వెండితెరకు పరిచయం అయిన హీరో అఖిల్. తొలి సినిమాతోనే మాస్ హీరో

అక్కినేని నటవారసుడిగా భారీ అంచనాల మధ్య వెండితెరకు పరిచయం అయిన హీరో అఖిల్. తొలి సినిమాతోనే మాస్ హీరో ఇమేజ్ కోసం ప్రయత్నించిన అఖిల్ అభిమానులను నిరాశపరిచాడు. చాక్లెట్ బాయ్ల కనిపించే అక్కినేని అందగాడు, భారీ యాక్షన్ సీన్లు, చేజ్లు చేయటంతో అభిమానులు కనెక్ట్ కాలేకపోయారు. దీంతో అఖిల్ తొలి ప్రయత్నం డిజాస్టర్గా మిగిలిపోయింది.

అయితే రెండో సినిమా విషయంలో కూడా అదే తప్పు చేస్తున్నాడు ఈ యంగ్ హీరో. మనం ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అఖిల్ తన రెండో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించిన అఖిల్, భారీ యాక్షన్ సీన్స్కు రెడీ అవుతున్నాడట. అందుకోసం హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్లను తీసుకువస్తున్నారు.

ఈ సినిమాతో అయినా అఖిల్, తండ్రి బాటలో మన్మథుడి ఇమేజ్ కంటిన్యూ చేస్తాడనుకుంటే మరోసారి యాక్షన్ హీరో అయ్యే ప్రయత్నాల్లో ఉన్నాడన్న టాక్ వినిపిస్తోంది. ఈ ప్రయత్నం ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి. నాగార్జున స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమా అఖిల్ కెరీర్కు శివ లాంటి బ్రేక్ ఇస్తుందని యూనిట్ గట్టిగా నమ్ముతోంది.

Advertisement
 
Advertisement
Advertisement