అఖిల్ వివాహవేదిక ఖరారైందా..? | Akhil to Marry Shriya Bhupal in italy | Sakshi
Sakshi News home page

అఖిల్ వివాహవేదిక ఖరారైందా..?

Nov 1 2016 12:49 PM | Updated on Sep 4 2017 6:53 PM

అఖిల్ వివాహవేదిక ఖరారైందా..?

అఖిల్ వివాహవేదిక ఖరారైందా..?

అఖిల్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అక్కినేని నటవారసుడు అఖిల్, తన రెండో సినిమాతో పాటు పెళ్లి వార్తలతోనూ మీడియాలో హల్ చల్ చేస్తున్నాడు. తొలి సినిమా పరాజయంతో లాంగ్ గ్యాప్ తీసుకున్న అఖిల్...

అఖిల్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అక్కినేని నటవారసుడు అఖిల్, తన రెండో సినిమాతో పాటు పెళ్లి వార్తలతోనూ మీడియాలో హల్ చల్ చేస్తున్నాడు. తొలి సినిమా పరాజయంతో లాంగ్ గ్యాప్ తీసుకున్న అఖిల్, ప్రస్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. అదే సమయంలో తన పెళ్లి వేడుకకు కూడా ఘనంగా ఏర్పాట్లు చేసుకుంటున్నాడట.

తన ఫ్యామిలీ ఫ్రెండ్, ఫ్యాషన్ డిజైనర్ అయిన శ్రేయా భూపాల్తో పీకల్లోతు ప్రేమలో ఉన్న అఖిల్ త్వరలోనే ఆమె మెడలో మూడు ముళ్లు వేయడానికి రెడీ అవుతున్నాడు. నాగచైతన్య, సమంతల వివాహం కన్నా ముందే.. అఖిల్ పెళ్లి జరుగనుందని తెలుస్తోంది. అఖిల్ తన రెండో సినిమా పూర్తి చేసిన వెంటనే పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడట. ఈ పెళ్లిని డెస్టినేషన్ వెడ్డింగ్ తరహాలో ఇటలీలో నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే అఖిల్, శ్రేయా వివాహవేదికపై అధికారిక ప్రకటన రానుందన్న టాక్ వినిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement