అఖిల్ 2 టైటిల్ అదేనా..? | Akhil second movie title Hello | Sakshi
Sakshi News home page

అఖిల్ 2 టైటిల్ అదేనా..?

Aug 20 2017 2:56 PM | Updated on Jul 15 2019 9:21 PM

తొలి సినిమాతో నిరాశపరిచిన అక్కినేని నట వారసుడు అఖిల్ రెండో సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

తొలి సినిమాతో నిరాశపరిచిన అక్కినేని నట వారసుడు అఖిల్ రెండో సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. కింగ్ నాగార్జున స్వయంగా దగ్గరుండి సినిమా పనులన్ని చూసుకుంటున్నాడు. మనం ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ తో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నాడు అఖిల్.

ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమా ఫస్ట్ లుక్ ఇప్పటికే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అయితే ఈ సోమవారం సినిమాకు సంబంధించిన బిగ్ ఎనౌన్స్మెంట్ ఉంటుందంటూ అక్కినేని టీం ఊరిస్తోంది. అంతేకాదు సినిమా టైటిల్ ఏం అయి ఉంటుందో గెస్ చేయాలని హింట్స్ కూడా ఇస్తోంది. ముందుగా నాగార్జున తన నిర్ణయం సినిమాలోని 'హలో గురు ప్రేమ కోసమేనా' ను పోస్ట్ చేసి సినిమా టైటిల్  ఈపాటలోనే ఉంటుంది అంటూ హింట్ ఇచ్చాడు.

తాజాగా ఆదివారం నాగచైతన్య మరో హిట్ ఇచ్చాడు. తన సూపర్ హిట్ సినిమా ఏం మాయ చేసావే సినిమాలో 'హో సోన' పాటను ట్వీట్ చేసి అఖిల్ 2 టైటిల్ ఈ పాటలోనే ఉంది అంటూ మరో హింట్ ఇచ్చాడు. అయితే ఈ రెండు పాటల్లో కామన్ గా ఉన్న పదం 'హలో'. ఇదే అఖిల్ రెండో సినిమా టైటిల్ అని ఫిక్స్ అవుతున్నారు ఫ్యాన్స్.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement