మనవడో... వారసుడో... | akhil mister majnu first look, teaser release | Sakshi
Sakshi News home page

మనవడో... వారసుడో...

Sep 20 2018 12:27 AM | Updated on Sep 20 2018 12:27 AM

akhil mister majnu first look, teaser release - Sakshi

అఖిల్‌ ‘మిస్టర్‌ మజ్ను’ ఫస్ట్‌ లుక్‌

‘దేవదాసు మనవడో... మన్మథుడి వారసుడో..’ అంటూ అఖిల్‌ పాత్రను పరిచయం చేస్తూ ఆయన కొత్త సినిమా ఫస్ట్‌ లుక్‌ వీడియోను రిలీజ్‌ చేసింది చిత్రబృందం. అఖిల్‌ హీరోగా ‘తొలిప్రేమ’ ఫేమ్‌ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మిస్టర్‌ మజ్ను’. నిధీ అగర్వాల్‌ కథానాయిక. బీవీయస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మాత. ఈరోజు ఏయన్నార్‌ జయంతి సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌తో పాటు టైటిల్‌ను రిలీజ్‌ చేశారు.

‘ఏయన్‌ఆర్‌ 8’ అనే బండి నంబర్‌ ఉండే కారులో అఖిల్‌ను చూపించడం, ‘హలో మిస్‌...  ఏంటో ఈ ఇంగ్లీష్‌ భాష దేన్నైతే మిస్‌ చేసుకోకూడదో దాన్నే మిస్‌ అని పిలుస్తారు’ అనే డైలాగ్‌ హైలైట్‌గా ఉంది. ఫస్ట్‌ లుక్‌ వీడియోను  బట్టి ఈ చిత్రంలో అఖిల్‌ ప్లేబాయ్‌ క్యారెక్టర్‌ పోషిస్తున్నారని ఊహించవచ్చు. ‘‘అఖిల్‌ తాతగారు నాగేశ్వరారవు ‘లైలా మజ్ను’గా, తండ్రి నాగార్జునగారు ‘మజ్ను’గా నటించారు. ఇప్పుడు అఖిల్‌ ‘మజ్ను’గా అలరించడానికి రెడీ అయ్యారు. లుక్స్, స్టైల్, నటనతో అందర్నీ ఆకట్టుకుంటాడు. ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: తమన్‌. సాహిత్యం: శ్రీమణి, కెమెరా: జార్జ్‌ సి. విలియమ్స్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement