డాడీ బర్త్‌డేకి క్లాప్ బోర్డ్ రెడీ! | Akhil announces movie with Hanu Raghavapudi | Sakshi
Sakshi News home page

డాడీ బర్త్‌డేకి క్లాప్ బోర్డ్ రెడీ!

Jul 29 2016 10:42 PM | Updated on Jul 15 2019 9:21 PM

డాడీ బర్త్‌డేకి క్లాప్ బోర్డ్ రెడీ! - Sakshi

డాడీ బర్త్‌డేకి క్లాప్ బోర్డ్ రెడీ!

అఖిల్ రెండో సినిమాకి పేపర్ వర్క్ పూర్తయింది. స్క్రిప్ట్ రెడీ, ఇక పెన్‌తో పనిలేదు. క్లాప్ బోర్డ్, కెమేరా లెన్స్‌లతోనే...

అఖిల్ రెండో సినిమాకి పేపర్ వర్క్ పూర్తయింది. స్క్రిప్ట్ రెడీ, ఇక పెన్‌తో పనిలేదు. క్లాప్ బోర్డ్, కెమేరా లెన్స్‌లతోనే కుర్రాడు ముందుకు వెళ్లాలి. షూటింగ్ ప్రారంభించడమే తరువాయి. ‘అందాల రాక్షసి’, ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ సినిమాల ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో రెండో సినిమా చేస్తున్నట్టు మూడ్రోజుల క్రితం అఖిల్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. అక్కినేని నాగార్జున బర్త్‌డే సందర్భంగా ఆగస్టు 29న లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభం కానుందట. స్క్రిప్ట్ వర్క్ పూర్తయినా క్లాప్ కొట్టేది మాత్రం అప్పుడేనని టాలీవుడ్ టాక్. హీరోయిన్, ఇతర వివరాలను ఆ రోజున ప్రకటించనున్నారట. రెగ్యులర్ షూటింగ్ ఈ ఏడాది ఆఖరున ప్రారంభిస్తారని యూనిట్ సన్నిహిత వర్గాల సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement