గోవాలో...

Akash Puri is Romantic film shoot progress in Goa - Sakshi

గోవా మంచి హాలిడే స్పాట్‌. అది మాత్రమే కాదు.. షూటింగ్స్‌కి కూడా మంచి స్పాట్‌. అందుకే ‘రొమాంటిక్‌’ టీమ్‌ గోవా వెళ్లింది. పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్, పూరి కనెక్ట్స్‌ పతాకాలపై పూరి, చార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లావణ్య సమర్పణలో రూపొందుతోన్న ఈ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌లో ఆకాశ్‌ పూరి, కేతికా శర్మ జంటగా నటిస్తున్నారు. అనిల్‌ పాడూరి ఈ చిత్రానికి దర్శకుడు. రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ గోవాలో 30 రోజులపాటు జరగనుంది. ఈ లాంగ్‌ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలతో పాటు, యాక్షన్‌ సీన్స్, సాంగ్స్‌ చిత్రీకరించనున్నారు. సునీల్‌ కశ్యప్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి నరేశ్‌ ఫోటోగ్రఫీని అందిస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top