వంద కోట్ల సినిమా రిలీజ్ వాయిదా | Ajith Vivegam release Postponed | Sakshi
Sakshi News home page

వంద కోట్ల సినిమా రిలీజ్ వాయిదా

Aug 1 2017 12:39 PM | Updated on Sep 17 2017 5:03 PM

వంద కోట్ల సినిమా రిలీజ్ వాయిదా

వంద కోట్ల సినిమా రిలీజ్ వాయిదా

కోలీవుడ్ టాప్ హీరో అజిత్ హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ యాక్షన్ మూవీ వివేగం. అజిత్ హీరోగా వీరం, వేదలం

కోలీవుడ్ టాప్ హీరో అజిత్ హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ యాక్షన్ మూవీ వివేగం. అజిత్ హీరోగా వీరం, వేదలం లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన దర్శకుడు శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ మీద కన్నేశారు. జేమ్స్ బాండ్ తరహా కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్ గా నటిస్తున్నాడు.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ముందుగా ఆగస్టు 10న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే భారీ గ్రాఫిక్స్ తో తెరకెక్కుతుండటంలో విజువల్ ఎఫెక్ట్స్ కోసం మరింత సమయం కేటాయించాలన్న ఉద్దేశంతో సినిమాను రెండు వారాల పాటు వాయిదా వేశారు. తెలుగులో వివేకం పేరుతో రిలీజ్ అవుతున్న ఈ సినిమాను తెలుగు తమిళ భాషల్లో ఒకే సారి ఆగస్టు 24న రిలీజ్ చేయనున్నారు. కాజల్ అగర్వాల్, అక్షరా హాసన్ లు హీరోయిన్లు గా నటిస్తున్న ఈ సినిమాకు కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతమందిస్తున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement