వైరల్‌ : అజిత్‌ ‘విశ్వాసం’ మోషన్‌ పోస్టర్‌..!

Ajith Viswasam Motion Poster Is At Trending - Sakshi

తమిళనాట రజనీకాంత్‌, విజయ్‌, అజిత్‌లకు ఉండే క్రేజే వేరు. వీరికి కేవలం తమిళనాటే కాకుండా.. దేశవిదేశాల్లో అభిమాన గణం ఉంది. వీరి సినిమాలు రిలీజ్‌ అవుతూ ఉంటే పండుగ వాతావరణం నెలకొంటుంది. ఇక వీరి సినిమాలకు సంబంధించిన టీజర్స్‌, మూవీ అప్‌డేట్స్‌, ట్రైలర్స్‌, పోస్టర్‌లు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతూ ఉంటాయి. మొన్నటి వరకు సర్కార్‌ హవా కొనసాగగా, ప్రస్తుతం 2.ఓ ట్రెండింగ్‌లో ఉండగా.. ఇప్పుడు అజిత్‌ వంతు వచ్చినట్టు కనిపిస్తోంది. 

వీరం, వేదాలం, వివేగం వంటి సూపర్‌హిట్‌లను అందించిన అజిత్‌-శివ కాంబినేషన్‌లో విశ్వాసం రాబోతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి బరిలో దిగనుంది. తాజాగా ఈ చిత్రం నుంచి విడుదలైన మోషన్‌ పోస్టర్‌ సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. అజిత్‌కు సంబంధించిన ఈ మోషన్‌ పోస్టర్‌ ఇండియాస్‌ మోస్ట్‌ లైక్‌డ్‌ పోస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రంలో అజిత్‌కు జోడిగా నయనతార నటించారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Taboola - Feed

Back to Top