సీక్వల్ ప్లాన్ లో అజిత్, శివ | Ajith and Siva to collaborate for Veeram 2 | Sakshi
Sakshi News home page

సీక్వల్ ప్లాన్ లో అజిత్, శివ

Oct 11 2017 4:21 PM | Updated on Oct 11 2017 4:21 PM

Ajith Kumar Director Siva

వివేగం సక్సెస్ తరువాత గ్యాప్ తీసుకున్న అజిత్ తిరిగి సినిమాలతో బిజీ అయ్యేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటి వరకు తన తదుపరి చిత్రాన్ని ఎనౌన్స్ చేయని అజిత్, మరోసారి హిట్ కాంబినేషన్ లో పనిచేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారట. గతంలో అజిత్ ఓ చారిత్రక చిత్రంలో నటిస్తారన్న టాక్ వినిపించినా.. ప్రస్తుతం ఆ ప్రయత్నాలు విరమించుకున్నారట.

మరోసారి తన లక్కీ డైరెక్టర్ శివ దర్శకత్వంలో నటిచేందుకు అజిత్ ఆసక్తికనబరుస్తున్నారట. అజిత్ హీరోగా శివ తెరకెక్కించిన తొలి సినిమా వీరంకు సీక్వల్ ను రూపొందించే ఆలోచనలో ఉన్నారన్న వార్త ఇప్పుడు కోలీవుడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే వీరి కాంబినేషన్ లో వీరం, వేదలం, వివేగం లాంటి కమర్షియల్ సక్సెస్ లు వచ్చాయి. ఇప్పుడు మరోసారి తో అదే ఫీట్ రిపీట్ చేసేందుకు రెడీ అవుతున్నారు అజిత్, శివ.

Advertisement
 
Advertisement
Advertisement