ఆ హీరో లుక్‌కు ఫిదా అయిన రానా
కోలీవుడ్ హీరో అజిత్ తెల్లజుట్టుతోనే ఉన్నా.. తన పెర్ఫార్మెన్సుతో అదరగొడతాడు.
కోలీవుడ్ హీరో అజిత్ తెల్లజుట్టుతోనే ఉన్నా.. తన పెర్ఫార్మెన్సుతో అదరగొడతాడు. తాజాగా అతడు నటిస్తున్న వివేగం సినిమా పోస్టర్ రిలీజ్ కావడంతో.. అందులో అజిత్ లుక్ చూసి టాలీవుడ్ కండల యోధుడు రానా ఫిదా అయిపోయాడు. ట్విట్టర్‌లో అజిత్ పోస్టర్‌ను పోస్ట్ చేయడంతో పాటు 'వావ్.. వావ్.. వావ్.. ఔట్ స్టాండింగ్' అంటూ మెసేజ్ పెట్టాడు. ఈ లుక్ తామందరికీ చాలా స్ఫూర్తిదాయకమని చెప్పాడు. వృత్తిపట్ల ఇంత అంకిత భావం ఉండటం చాలా అరుదని అన్నాడు. అజిత్‌ను నిజంగా రాక్ స్టార్ అంటూ పొగడ్తలతో ముంచెత్తాడు.
అజిత్ హీరోగా నటిస్తున్న 57వ సినిమా వివేగం. సినిమా ఫస్ట్‌లుక్, టైటిల్ ఒకేసారి విడుదల చేశారు. 'బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్' అనేది దీనికి ట్యాగ్‌లైన్. దాదాపు 100 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాకు డైరెక్టర్ శివ. ఇందులో కాజల్, అక్షర హాసన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రలో కనిపిస్తాడు.