అవి లిప్‌లాక్ సన్నివేశాలేనా? | Ajit, Anushka Liplock sequences ? | Sakshi
Sakshi News home page

అవి లిప్‌లాక్ సన్నివేశాలేనా?

May 1 2014 11:46 PM | Updated on Sep 2 2017 6:47 AM

అవి లిప్‌లాక్ సన్నివేశాలేనా?

అవి లిప్‌లాక్ సన్నివేశాలేనా?

కోలీవుడ్‌లో ప్రస్తుతం ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. నటుడు అజిత్ మంగాత్తా, ఆరంభం, వీరం చిత్రాల విజయంతో మంచి జోష్‌లో ఉన్నారు.

 కోలీవుడ్‌లో ప్రస్తుతం ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. నటుడు అజిత్ మంగాత్తా, ఆరంభం, వీరం చిత్రాల విజయంతో మంచి జోష్‌లో ఉన్నారు. గురువారం పుట్టిన రోజు వేడుకను జరుపుకున్నారు. ఈ స్టార్ హీరో తాజాగా గౌతమ్ మీనన్ దర్శత్వంలో నటిస్తున్నారు. ఆరంభం ఫేమ్ ఎ.ఎం.రత్నం నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో అజిత్ సరసన అనుష్క హీరోయిన్‌గా నటిస్తున్నారు. మరో హీరోయిన్‌గా త్రిష ఓకే అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. తొలుత అజిత్ నటించే యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు.
 
 తాజాగా అజిత్, అనుష్క మధ్య ప్రేమ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇటీవల ఈ సన్నివేశాలను మూడు రోజులపాటు యూనిట్‌ను దూరంగా పెట్టి చిత్రీకరించినట్టు సమాచారం. దర్శకుడు హీరో హీరోయిన్ కెమెరామెన్ మినహా ఎవరినీ షూటింగ్ దరిదాపులకు రానియలేదట. ఆ మూడు రోజులు యూనిట్‌కు పనిచేయకుండానే జీతం చెల్లించినట్టు తెలిసింది. ఇంతకీ బేడ్ రూమ్‌లో అంత్యత రహస్యంగా చిత్రీకరించింది అజిత్, అనుష్క మధ్య లిప్‌లాక్ సన్నివేశాలా? అన్న ఆసక్తికరమైన చర్చకు అవకాశం కల్పించారంటున్నారు కోలీవుడ్ వర్గాలు.
 

Advertisement
 
Advertisement
Advertisement