మ్యాచ్‌ వాయిదా | ajaydevgan new movie maidan release date postponed | Sakshi
Sakshi News home page

మ్యాచ్‌ వాయిదా

Feb 4 2020 12:16 AM | Updated on Feb 4 2020 12:16 AM

ajaydevgan new movie maidan release date postponed - Sakshi

అజయ్‌ దేవగన్‌

‘మైదాన్‌’ సినిమా కోసం బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగన్‌ ఫుట్‌బాల్‌ కోచ్‌గా మారారు. ఆయన కోచింగ్‌లో తయారైన టీమ్‌ ఆడాల్సిన మ్యాచ్‌ వాయిదా పడిందని తెలిసింది. అమిత్‌ రవీంద్రనాథ్‌ శర్మ దర్శకత్వంలో అజయ్‌ దేవగన్‌ నటిస్తున్న చిత్రం ‘మైదాన్‌’. ఈ సినిమాలో ఇండియా ఫుట్‌బాల్‌ కోచ్‌ సయ్యద్‌ అబ్దుల్‌ రహీమ్‌ పాత్రను పోషిస్తున్నారు అజయ్‌. తొలుత ఈ సినిమాను నవంబర్‌ 27న రిలీజ్‌ చేయాలనుకున్నారు. ఇప్పుడు డిసెంబర్‌ 11న విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది చిత్రబృందం. ఇందులో అజయ్‌ భార్యగా ప్రియమణి నటిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement