అఖిల్ సినిమాలో యంగ్ విలన్ | Ajay to play villain in akhils next | Sakshi
Sakshi News home page

అఖిల్ సినిమాలో యంగ్ విలన్

Apr 18 2017 3:56 PM | Updated on Jul 15 2019 9:21 PM

అఖిల్ సినిమాలో యంగ్ విలన్ - Sakshi

అఖిల్ సినిమాలో యంగ్ విలన్

తొలి సినిమాతో నిరాశపరిచిన అక్కినేని నట వారసుడు అఖిల్, రెండో సినిమా విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. లాంగ్

తొలి సినిమాతో నిరాశపరిచిన అక్కినేని నట వారసుడు అఖిల్, రెండో సినిమా విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. లాంగ్ గ్యాప్ తరువాత మనం ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రెండో సినిమాను ప్రారంభించాడు. ఈ సినిమాను కింగ్ నాగార్జున అనపూర్ణ స్టూడియోస్ బ్యానర్పై స్వయంగా నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రస్టింగ్ అప్డేట్ ఒకటి టాలీవుడ్ సర్కిల్స్లో వినిపిస్తోంది.

విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇష్క్, 24 సినిమాలో విలన్ గా నటించిన టాలీవుడ్ యంగ్ యాక్టర్ అజయ్, అఖిల్ సినిమాలోనూ విలన్గా కనిపించనున్నాడు. ఇప్పటికే అఖిల్ సినిమా యూనిట్తో అజయ్ కూడా చేరిపోయాడు. అయితే ఈ సినిమాలో అజయ్, మెయిన్ విలన్గా నటిస్తున్నాడా..? లేక మరో విలన్ కూడా ఉంటాడా..? అన్న విషయం తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement