మైండ్‌ రీడర్‌ పగ | Ajay Special will release the film shortly | Sakshi
Sakshi News home page

మైండ్‌ రీడర్‌ పగ

Nov 11 2017 12:29 AM | Updated on Nov 11 2017 12:29 AM

Ajay Special will release the film shortly - Sakshi

విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు అజయ్‌. ప్రస్తుతం ఆయన హీరోగా రూపొందుతోన్న సినిమా ‘స్పెషల్‌’. అక్షిత కథానాయిక. వాస్తవ్‌ దర్శకత్వంలో నందలాల్‌ క్రియేషన్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమా పూర్తయింది. దర్శకుడు మాట్లాడుతూ– ‘‘మైండ్‌ రీడింగ్‌ స్కిల్స్‌ చాలా స్ట్రాంగ్‌గా ఉన్న ఒక వ్యక్తిని కొందరు మోసం చేస్తారు. వారిని తన స్కిల్‌తో ఎలా పట్టుకున్నాడు? ఎలా పగ తీర్చుకున్నాడు? అన్నది ఆసక్తికరం.

అజయ్‌ స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్‌గా మైండ్‌ రీడర్‌ చేస్తున్న క్రైమ్‌ని, దాని వెనుక ఉన్న రీజన్స్‌ని వెతికి, వెలికి తీసే పాత్రలో నటించారు. ఈ సినిమాలో కొత్త అజయ్‌ని చూస్తారు. ఫొటోగ్రఫి, విజువల్స్‌ డిఫరెంట్‌గా ఉంటాయి. హాలీవుడ్‌ సినిమా చూసిన ఫీలింగ్‌ కలుగుతుంది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. సంతోష, అశోక్‌ కుమార్, చక్రపాణి, జబర్దస్త్‌ అప్పారావు, ప్రకాశ్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: అమర్‌ కుమార్, సంగీతం: యస్వీయస్‌ మణ్యం.

Advertisement
 
Advertisement
Advertisement