చాణక్యుడి పాత్రలో స్టార్‌ హీరో | Ajay Devgn Signed For a Historical Film Chanakya | Sakshi
Sakshi News home page

Jul 11 2018 11:41 AM | Updated on Jul 11 2018 2:12 PM

Ajay Devgn Signed For a Historical Film Chanakya - Sakshi

సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలలో హిస్టారికల్‌, ఫోక్‌లోర్ సినిమాల హవా కనిపిస్తోంది. భారతీయ సినిమాలు అంతర్జాతీయ స్థాయిలో భారీ వసూళ్లు సాధిస్తుండటంతో  మన మేకర్స్‌ భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మక చిత్రాలను తెరకెక్కించేందుకు ముందుకు వస్తున్నారు. ఇటీవల పద్మావత్‌ సినిమా ఘనవిజయం సాధించగా ప్రస్తుతం మణికర్ణిక చిత్రీకరణ జరుగుతోంది. తాజాగా మరో చారిత్రక పాత్రను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు బాలీవుడ్ మేకర్స్‌.

చరిత్రలో ఎంతో గొప్ప రాజనీతిజ్ఞుడు, గురువు, ఆర్థిక నిపుణుడు అయిన చాణక్యుడి కథను వెండితెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు. యాక్షన్‌ చిత్రాల దర్శకుడిగా పేరున్న నీరజ్‌ పాండే ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. బాలీవుడ్ స్టార్ అజయ్‌ దేవగన్‌ టైటిల్‌ రోల్‌ లో నటించేందుకు అంగీకరించారు. అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌.. ఫ్రైడే ఫిలిం వర్క్స్‌, ప్లాస్‌ సి స్టూడియోస్‌ బ్యానర్‌లతో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement