బ్యాక్‌ టు బ్యాక్‌ | Ajay Devgn to Play Legendary Football Coach Syed Abdul Rahim biopic | Sakshi
Sakshi News home page

బ్యాక్‌ టు బ్యాక్‌

Jul 14 2018 4:23 AM | Updated on Aug 9 2018 7:30 PM

Ajay Devgn to Play Legendary Football Coach Syed Abdul Rahim biopic - Sakshi

ప్రస్తుతం ప్రపంచమంతా సాకర్‌ ఫుట్‌బాల్‌ ఫీవర్‌లో ఉంది. ఫుట్‌బాల్‌ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే మూవీని అనౌన్స్‌ చేయడానికి ఇలాంటి క్రేజీ టైమ్‌ను ఎవ్వరూ వదులుకోరు. అజయ్‌ దేవగన్‌ అండ్‌ టీమ్‌ కూడా వదులుకోలేదు. ఇండియన్‌ ఫుట్‌బాల్‌ కోచ్‌ సయ్యద్‌ అబ్దుల్‌ రహీమ్‌ జీవితం ఆధారంగా ఓ మూవీ తెరకెక్కంచనున్నట్లు ప్రకటించారు. 1950–1963 టైమ్‌లో ఇండియన్‌ ఫుట్‌బాల్‌ టీమ్‌కి కోచ్, మేనేజర్‌గా సయ్యద్‌ సేవలు అందించారు.

1956 మెల్‌బోర్న్‌ ఒలిపింక్స్‌లో ఇండియన్‌ ఫుట్‌బాల్‌ టీమ్‌ సెమీ ఫైనల్స్‌కు, 1962 ఆసియన్‌ గేమ్స్‌లో టీమ్‌ గోల్డ్‌ మెడల్‌ సాధించడంలో సయ్యద్‌ పాత్ర ప్రముఖమైనది. సయ్యద్‌ బయోపిక్‌లో అజయ్‌ నటించనున్నారు. అమిత్‌ శర్మ దర్శకుడు. మరోవైపు    రాజనీతి శాస్త్రజ్ఞుడు, ఆర్థికవేత్త చాణక్య బయోపిక్‌లోనూ నటించడానికి అజయ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఈ సినిమాకు నీరజ్‌ పాండే దర్శకుడు. ఇలా బ్యాక్‌ టు బ్యాక్‌ బయోపిక్స్‌లో నటించడానికి అజయ్‌ దేవగన్‌ అంగీకరించడం విశేషం.

Advertisement
 
Advertisement
Advertisement