నిజాలు దాచను!

Aishwarya Rai Bachchan opens up about her probable biopic - Sakshi

అందాల సుందరి జీవితం అందంగానే ఉంటుందా? సమస్యలుండవా? ఉంటాయి. రోజా పువ్వు చుట్టూ ముళ్లు ఉన్నట్లు అందగత్తె చుట్టూ ఎన్నో ముళ్లు. అన్నింటినీ అధిగమించాలంటే బోలెడంత ఆత్మవిశ్వాసం కావాలి. ఐశ్వర్యారాయ్‌కి అది ఉంది. ఆర్కిటెక్చర్‌ స్టూడెంట్‌ అయిన ఆమె ‘మిస్‌ వరల్డ్‌’ కాకపోయి ఉంటే సాదాసీదాగా మిగిలిపోయేవారేమో. ప్రపంచం మొత్తం తనవైపు చూసేలా చేసుకున్నారు. దానికోసం ఐష్‌ పడినది మామూలు కష్టం కాదు.

నేమ్‌ వచ్చేవరకూ ఎవరూ పట్టించుకోరు. వచ్చాక వదలరు. ఐష్‌ లైఫ్‌ దీనికి ఓ మంచి ఉదాహరణ. కష్టపడినప్పుడు ఎవరూ సహాయం చేయలేదు. పేరు వచ్చాక వెంటపడ్డారు. తక్కువ కాలంలోనే స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగారు. అంతా సజావుగా సాగితే చెప్పడానికి ఏముంటుంది? ఓ పెద్ద కుదుపు. లవ్‌ ఫెయిల్యూర్‌. మీడియాలో ఏవేవో కథనాలు. లైఫ్‌లో అనుకోని డిస్ట్రబెన్సెస్‌. కొన్ని సినిమాలు ఫ్లాప్‌. పర్సనల్, ప్రొఫెషనల్‌ లైఫ్‌ రెండూ బాగా లేవు.

ఐష్‌ ఓపిక పట్టారు. హీరోయిన్‌గా సక్సెస్‌ కొట్టారు. ప్రేమ అనే చేదు అనుభవాన్ని తుడిచేశారు. అభిషేక్‌ బచ్చన్‌ని పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించారు. ఓ బిడ్డకి తల్లి అయ్యాక దాదాపు నాలుగేళ్లు స్క్రీన్‌కి దూరమయ్యారు. మళ్లీ మేకప్‌ వేసుకున్నారు... క్లుప్తంగా ఐష్‌ జీవితం ఇది. మొత్తంగా ఓ సినిమాకి కావాల్సిన మెటీరియల్‌ ఆమె లైఫ్‌లో ఉంది. మరి.. మీ బయోపిక్‌పై మీ అభిప్రాయం ఏంటీ? అని ఐశ్వర్యారాయ్‌ని అడిగితే...‘‘బయోపిక్‌ తీస్తే వాస్తవాలను దాచకూడదన్నది నా అభిప్రాయం.

అది నా బయోపిక్‌ అయినా సరే. నా జీవితం ఓ గొప్ప కథ అవుతుంది. ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేస్తుందంటే తప్పకుండా నా బయోపిక్‌ తెరకెక్కాలని నేను కోరుకుంటాను. కానీ ఇప్పుడే ఈ ఆలోచన లేదు’’ అన్నారు. బయోపిక్‌లో నిజాలను దాచనంటున్నారు ఐశ్వర్య. మరి... నిజంగా ఐశ్వర్య బయోపిక్‌ తీస్తే అందులో ఆమె మాజీ ప్రేమికుడు సల్మాన్‌ఖాన్‌ పాత్రను ఎలా జస్టిఫై చేస్తారనే ఆసక్తి సినీ లవర్స్‌లో తప్పుకండా ఉంటుందని అనుకోవచ్చు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top