మాధురి–ఐశ్వర్య–జూహి.. ఓ అనిల్‌ | aishwarya madhuri dixit anil kapoor new ,movie plan | Sakshi
Sakshi News home page

మాధురి–ఐశ్వర్య–జూహి.. ఓ అనిల్‌

Feb 21 2018 1:04 AM | Updated on Feb 21 2018 1:04 AM

aishwarya madhuri dixit anil kapoor new ,movie plan - Sakshi

అనిల్‌కపూర్‌,మాధురి దీక్షిత్‌,జూహీ చావ్లా,ఐశ్వర్యారాయ్‌

భలే కుదిరింది జోడి. కెమిస్ట్రీ అదిరింది... ఇదిగో ఇలాంటి మాటలే అనిల్‌కపూర్‌–మాధురి దీక్షిత్‌లను తెరపై చూసి బీటౌన్‌ ప్రేక్షకులు మాట్లాడుకున్నారు. ఆల్మోస్ట్‌ అరడజను సినిమాలకు పైగా కలిసి నటించిన అనిల్‌ –మాధురి కాంబో చివరిసారిగా 2000లో ‘పుకార్‌’ సినిమాలో కనిపించింది. ఈ ఇద్దరూ మళ్లీ నటించడానికి 17ఏళ్ల టైమ్‌ పట్టింది. ఇంద్రకుమార్‌ దర్శకత్వంలో ‘ధమాల్‌’ ఫ్రాంచైజీలో తెరకెక్కుతున్న మూడో పార్ట్‌ ‘టోటల్‌ ధమాల్‌’ చిత్రంలో అనిల్‌–మాధురి మళ్లీ జోడీగా నటిస్తున్నారు. సేమ్‌ టైమ్‌ హీరోయిన్‌ ఐశ్వర్యారాయ్‌తోనూ ఇదే సీన్‌ రీపీట్‌ అయ్యింది అనిల్‌కపూర్‌కు. 2000లో ‘హామారా దిల్‌ ఆప్‌కే పాస్‌ హై’ చిత్రంలో జంటగా నటించిన అనిల్‌ కపూర్, ఐశ్వర్యారాయ్‌ మళ్లీ స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడానికి 17 ఏళ్ల టైమ్‌ పట్టింది. రాకేష్‌ ఓం ప్రకాశ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఫ్యానీఖాన్‌’ చిత్రంలో అనిల్‌కపూర్‌–ఐశ్వర్యారాయ్‌ కలిసి నటిస్తున్నారు. ఈ సినిమాను రంజాన్‌ సందర్భంగా రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.

మాధురి–ఐశ్వర్య మాత్రమే కాదండోయ్‌.. జూహీతో కూడా అనిల్‌ రీ–యూనియన్‌ అయ్యారు. ఆల్మోస్ట్‌ 11ఏళ్ల తర్వాత జూహీ చావ్లాతో కలిసి నటిస్తున్నారు అనిల్‌కపూర్‌. ఆయన నటించిన ‘1942: ఎ లవ్‌స్టోరీ’ మూవీలోని ‘ఏక్‌ లడకీ కో దేఖాతో ఏసా లగా’ చిత్రంలోని పాట గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాకి ఆ టైటిల్‌నే పెట్టారు. షెల్లీ చోప్రా దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో అనిల్‌కపూర్‌ తనయ సోనమ్‌ కపూర్‌ నటిస్తున్నారు. ఇలా ఈ ఏడాది అనిల్‌కపూర్, ఐశ్యర్యారాయ్, మాధురి దీక్షిత్, జూహీ చావ్లాలకు మెమొరబుల్‌ ఇయర్‌ అని చెప్పాలి. ఈ కాంబినేషన్లే కాకుండా బాలీవుడ్‌లో పదేళ్ల తర్వాత ఇంతియాజ్‌ అలీ దర్శకత్వంలో షాహిద్‌ కపూర్‌ నటించనున్నారని, ఆల్మోస్ట్‌ 23 ఏళ్ల తర్వాత సంజయ్‌దత్, శ్రీదేవి సిల్వర్‌స్క్రీన్‌పై సందడి చేయనున్నారని బాలీవుడ్‌ టాక్‌.  

Advertisement
 
Advertisement
Advertisement