అయిదేళ్ల తరువాత ఐష్ | After Five years Aishwarya | Sakshi
Sakshi News home page

అయిదేళ్ల తరువాత ఐష్

Nov 2 2015 11:52 PM | Updated on Apr 4 2019 5:20 PM

అయిదేళ్ల తరువాత ఐష్ - Sakshi

అయిదేళ్ల తరువాత ఐష్

వెండితెరపై ఐశ్వర్యా రాయ్ కనిపించి ఐదేళ్లయ్యింది. ఆమె తెరపై ఎప్పుడెప్పుడు కనిపిస్తారా? ఎప్పుడు చూస్తామా? అని అభిమానులు ఎదురు చూశారు.

వెండితెరపై ఐశ్వర్యా రాయ్ కనిపించి ఐదేళ్లయ్యింది. ఆమె తెరపై ఎప్పుడెప్పుడు కనిపిస్తారా? ఎప్పుడు చూస్తామా? అని అభిమానులు ఎదురు చూశారు. ఆ ఎదురు చూపులకు ఇటీవల విడుదలైన ‘జజ్బా’ బ్రేక్ వేసింది. ఇన్నేళ్ల తర్వాత ఐష్‌ని మళ్లీ తెరపై చూడటం ఆమె అభిమానులను ఆనందపరిచింది. హిందీలో ఇటీవల విడుదలైన ఈ ‘జజ్బా’ను ఆరెంజ్ మీడియా అధినేతలు నివాస్‌వర్మ, సతీశ్ తెలుగులోకి ‘అడ్వకేట్ అనురాధ వర్మ’గా అనువదించారు. ఈ 6న చిత్రం విడుదల కానుంది.
 
నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘ఓటమి అనేది తెలియని అడ్వకేట్ అనురాధ వర్మగా ఇందులో ఐశ్వర్యా రాయ్ నటించారు. కథ గురించి చెప్పాలంటే... ఒక అమ్మాయిపై అత్యాచారం జరిపి, హత్య చేసిన ఓ హంతకుడికి శిక్ష పడేలా చేయడానికి అనురాధ న్యాయస్థానంలో వాదిస్తుంది.

ఈ నేపథ్యంలో అనురాధ కూతుర్ని కిడ్నాప్ చూసి, ఆ కేసులో ఓడిపోవాలని కిడ్నాపర్లు బెదిరిస్తారు. కూతురి కోసం అనురాధ కేసు ఓడిపోయిందా? గెలవడంతో పాటు తన కూతుర్ని దక్కించుకుందా? అనేది మిగతా కథ. ఐశ్వర్యా రాయ్ అద్భుతంగా నటించారు. ఆద్యంతం ఉత్కంఠకు గురయ్యేలా దర్శకుడు సంజయ్ గుప్తా తెరకెక్కించారు’’ అని చెప్పారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement