ఎనిమిదేళ్ల తరువాత ‘అర్జున’ విడుదల | After 8 Years Arjuna Movie Ready For Release | Sakshi
Sakshi News home page

ఎనిమిదేళ్ల తరువాత ‘అర్జున’ విడుదల

Mar 8 2019 1:37 PM | Updated on Mar 8 2019 1:39 PM

After 8 Years Arjuna Movie Ready For Release - Sakshi

గరుడవేగ సినిమా యాంగ్రీ హీరో రాజశేఖర్‌కు పూర్వ వైభవం తీసుకువచ్చిందనటంలో ఏ మాత్రం సందేహం లేదు. అందుకే ఈ సినిమా తరువాత రాజశేఖర్‌ కెరీర్‌ మళ్లీ ఊపందుకుంది. అంతేకాదు గతంలో రాజశేఖర్‌ హీరోగా ప్రారంభమై ఆగిపోయిన సినిమాలకు కూడా ఇప్పుడు మంచి రోజులొచ్చాయి. 2011లొ రాజశేఖర్‌ హీరోగా అర్జున సినిమాను ప్రారంభించారు.

తరువాత ఏమైందో కాని ఈ సినిమా ఊసే లేదు. ఏళ్లు గడిచిపోయాయి. రాజశేఖర్ ఇతర చిత్రాలతో బిజీ అయ్యాడు. సడన్‌గా ఇప్పుడు అర్జున తెర మీదకు వచ్చింది. సెన్సార్‌ కార్యక్రమాలను కూడా పూర్తి చేసి ఈ నెల 15న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్‌. ఇదే జోరులో రామ్‌ గోపాల్ వర్మ, రాజశేఖర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన పట్టపగలు సినిమా కూడా రిలీజ్ అవుతుందేమో చూడాలి.

కన్మణి దర్శకత్వంలో తెరకెక్కించిన ‘అర్జున’ సినిమాలో మర్యం జకారియా, సాక్షి గులాటీలు హీరోయిన్లుగా నటించగా వందేమాతరం శ్రీనివాస్‌ సంగీతమందించారు. రాజశేఖర్ ప్రస్తుతం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కల్కి’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement